రాష్ట్రీయం

వంద ఎకరాల్లో టెక్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో సహకరించేందుకు మలేసియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులోభాగంగా తొలుత అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులో తొలిదశలో 30, 40 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.350 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏప్రిల్‌లో మలేసియా ప్రధాని భారత్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ప్రధానుల సమక్షంలో దీనికి సంబంధించిన జీ టూ జీ, లేదా బీ టూ బీ ఒప్పందాలు జరగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మలేసియన్ బృందం దీనిపై చర్చలు జరిపింది. మలేసియన్ ఇండస్ట్రీ- గవర్నమెంట్ గ్రూప్ ఫర్ హై టెక్నాలజీ (మైట్) ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. మలేసియా ప్రభుత్వానికి చెందిన ‘మైట్’ వరిగడ్డి, ఇతర పంటల వ్యర్థాల నుంచి తయారుచేసే ‘బయో డీగ్రేడబుల్స్’ సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. ‘ఫ్రీ ద సీడ్’ అనే మలేసియన్ సంస్థ ఈ సాంకేతికతకు పేటెంట్ కలిగి ఉంది.
ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కులో భాగంగా ‘మైట్’ తొలుత ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీ సైక్లింగ్ ప్లేట్లు, ఇతర ప్యాకేజింగ్ సామగ్రిని తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. ఈ రీ సైక్లింగ్ ప్లేట్లు ప్రస్తుతం మనం వివాహాలు, ఇతర వేడుకల్లో భోజనం చేసేందుకు ఉపయోగించే పేపర్ ప్లేట్ల మాదిరిగానే ఉంటాయి. ప్లాస్టిక్ ప్లేట్లు పర్యావరణానికి హాని చేస్తున్నందున పరిశోధన చేసి వాటిస్థానంలో బయో డీగ్రేడబుల్స్‌ను తయారుచేసే సాంకేతికతను కనుగొన్నామని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా ఉత్పత్తులను ముఖ్యమంత్రికి ప్రదర్శించారు. ప్యాకేజింగ్, ఫుడ్ ప్లేట్లు మాత్రమే కాకుండా వైద్య అవసరాలకు ఉపయోగించే సామగ్రిని కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో సర్జరీ, మెడికల్ అవసరాలకు ప్రస్తుతం ఉపయోగించే స్టీల్ ప్లేట్లను శుభ్రం చేయడానికి ఎప్పటికప్పుడు నీటిని ఉపయోగించాల్సి ఉంటుందని, వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే బయో డీగ్రేడబుల్స్‌తో ఆ మేరకు ఖర్చు తగ్గిపోతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి ప్రధానంగా పండించే రైతులకు ఈ యూనిట్ ఏర్పాటు వల్ల ఎకరానికి ఏటా మరో రూ.50వేల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. వరిగడ్డి, చెరకు పిప్పి, జొన్న, మొక్కజొన్న తరహా పంటలకు చెందిన రైతులందరూ వ్యర్థాలను సరఫరా చేయడం ద్వారా లబ్ధి పొందగలుగుతారని తెలిపారు. తొలిదశలో వంద ఎకరాల్లో 30, 40 పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఇవన్నీ చిన్న, మధ్యతరహా యూనిట్లేనని మలేసియన్ బృందం తెలిపింది. ఇవి ఒకసారి ఉపయోగించి పారేసినా ఆరునెలల్లో ఇవి ఎరువుగా మారి పూర్తిగా భూమిలో కలిసిపోతాయని చెప్పారు. ఈ తరహా సాంకేతికతను ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసింది తామేనని తెలిపారు. ఈ ఉత్పత్తులకు యూరప్‌లో 10 బిలియన్ డాలర్ల మేరకు మార్కెట్ ఉంటే, అమెరికాలో 300 బిలియన్ డాలర్ల వరకు ఉందని వివరించారు. తొలుత ఏపీలో బయో డీగ్రేడబుల్స్ పరిశ్రమలను నెలకొల్పి ఇక్కడి నుంచి భారత్ మొత్తానికి విస్తరించాలన్నదే ప్రణాళికగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణంలో భాగస్వాములవుతామని డాక్టర్ శామి వెల్లు చెప్పారు. కృష్ణపట్నంలో గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చించేందుకు శామి వెల్లు గతంలో ఒక బృందాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో నిర్మాణమవుతున్న రీగ్యాసిఫికేషన్ టెర్మినల్, స్టోరేజీ టెర్మినల్ పురోగతిపై మలేషియన్ సంస్థ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుతో మలేషియా ప్రతినిధుల బృందం