రాష్ట్రీయం

ఆస్ట్రేలియా సహకారంతో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను వెలికితీసే ఇంజనీరింగ్ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు నిపుణుల కొరతను అధిగమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శుక్రవారం గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇక్కడ సమావేశమయ్యారు. మైనింగ్‌లో తమకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ప్రాంతంలో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసేలా తమ దేశంలోని కర్టిన్ యూనివర్శిటీ తగిన సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వాన, వరద నీటిని సద్వినియోగం చేసుకుని గ్రీన్‌బెల్ట్ ఏర్పరిచే సాంకేతికతలో తమకు గుర్తింపు ఉందని ఆస్ట్రేలియా ప్రతినిధులు వివరించారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయిల్‌లో నీటి పరిరక్షణ చర్యలతో పచ్చదనాన్ని పెంపొందించామని చెప్పారు. దీనిపై ఆసక్తి కనబరిచిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పట్టణాలు, నగరాలతోపాటు అమరావతిలోనూ వాననీటి సంరక్షణతో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వారిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టేందుకు వీలుగా సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌తో వెయ్యి కిలోమీటర్లు నడిచే ఎలక్ట్రికల్ బస్సులను తమ దేశంలోని ప్రైవేట్ సంస్థ తయారు చేస్తోందన్నారు. తమ దేశంలో గతంలో రోడ్డు ప్రమాదాల బారినపడి ఏడాదికి సగటున వెయ్యి మంది మృతిచెందేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 250కి తగ్గిందని ఆస్ట్రేలియా బృందం పేర్కొంది. ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోకుండా రహదారి భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని చెప్పారు. ఈ తరహా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. సమావేశంలో ఆస్ట్రేలియా రాయబారి సీన్ కెల్లీ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పెట్టుబడులు- వౌలిక వసతుల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, గనుల శాఖ డైరక్టర్ శ్రీ్ధర్, ఈడిబి అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. విజయవాడలో సిఎం చంద్రబాబుతో సమావేశమైన ఆస్ట్రేలియా ప్రతినిధులు