రాష్ట్రీయం

రక్తమోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/ గురజాల, మార్చి 17: గుంటూరు జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తమోడాయి. జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురజాల మండలం జంగమహేశ్వరపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో 31 మంది ప్రయాణికులతో వస్తున్న బొలేరో ప్రైవేటు వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గురజాల బుడగజంగాల కాలనీకి చెందిన 35 మంది వ్యవసాయ కూలీలు బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం తండాలో మిర్చికోతకు వెళ్లి తిరిగి వస్తూ ట్రక్కు వ్యాన్ ఎక్కారు. వ్యాన్ గురజాల సమీపంలోని జంగమహేశ్వరపురం శివార్లు దాటుతున్న సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి బోల్తాకొట్టింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కడెం నర్సమ్మ (60), పేర్ల మార్తమ్మ (60), కడెం స్వరూప (14), పట్టం కుమారి (14) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గంధం వెంకటమ్మ (50), కడెం సమ్మక్క (16) మార్గమధ్యంలో మృతి చెందారు. గురజాల పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఇదిలావుండగా గుంటూరు నగరం నడిబొడ్డున శంకర్‌విలాస్ సెంటర్ ఫ్లైవోవర్ వద్ద సిటీబస్సు ఢీకొని ఇద్దరు హాస్టల్ విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదంలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వడ్ల శ్రీనివాసచక్రవర్తి ఆచారి (19), శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన బీనా ప్రణిత్‌కుమార్ (18) ప్రాణాలు కోల్పోయారు.

చిత్రాలు..చెరువులో బోల్లాపడిన బొలేరో వాహనం * గుంటూరులో బస్సు ఢీకొని మృతిచెందిన ఇద్దరు విద్యార్థులు