రాష్ట్రీయం

మా బలం మరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ‘వచ్చే ఎన్నికల్లో మాకు ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెరాస ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయాన్ని వివిధ సర్వేలు సైతం ధ్రువీకరిస్తున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై సిఎం కెసిఆర్ జోక్యం చేసుకుంటూ మాట్లాడారు. ఎన్నికల బడ్జెట్ అని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం తాయిలాలు ప్రకటించినట్టు ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ఇంకా 26, 27 నెలల సమయం ఉందన్నారు. ప్రతిపక్షాలు ఏది చెబితే అది ప్రజలు విశ్వసించరని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని, పూర్తికాలం అధికారంలో ఉంటామని, సక్రమంగా పని చేస్తున్నామని చెబుతూ, వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ఏ పార్టీపైనా ఆధారపడకుండా అధికారం చేపట్టామని కెసిఆర్ గుర్తు చేశారు. తమను ఎవరూ నామినేట్ చేయలేదని, అప్పనంగా రాలేదని, ప్రజలు ఎన్నుకున్నారని గుర్తు చేశారు.
ఎంబిసి అంటే ఏమిటంటారా?
ఎంబిసి అంటే ఎవరు?, వెయ్యి కోట్లు ఎలా ఖర్చు పెడతారని ప్రతిపక్ష నేత కె జానారెడ్డి ప్రశ్నించారని, ఎంబిసి అంటే కూడా తెలియదా? అని సిఎం విమర్శించారు. ఎంబిసి అంటే మోస్ బ్యాక్‌వర్డ్ క్లాస్ అని వివరిస్తూ చేపలు పట్టే మత్స్యకారులు, గొర్రెల కాపరులు బడ్జెట్‌లో తాము కనిపిస్తున్నామని సంతోషించారని, లోగడ ఎప్పుడూ ఈ కులాల ప్రస్తావన లేదన్నారు. నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. డిస్కాంలకు 10 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, ఢిల్లీలో ఉదయ్ పథకం గురించి కాంగ్రెస్ చేసిన విమర్శలు అర్థసత్యాలు, అసత్యాలని కెసిఆర్ తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ కోసం అదనంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని అసెంబ్లీలో తెరాస ఎమ్మెల్యేలు కింద కూర్చుంటే వారిని తొక్కుతూ వెళ్ళిపోయారని విమర్శించారు. తమకు ముందు చూపుందని, పిపిఎ ఉంటేనే కారిడార్ నుంచి విద్యుత్ కొనొచ్చని అన్నారు. 2 వేల మెగావాట్ల లైన్ ఎందుకని విపక్షాలు ప్రశ్నించడాన్ని ఎద్దేశా చేశారు. విద్యుత్‌కు 10-20 వేల కోట్ల ఖర్చు చేయనున్నామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం రాష్ట్రం పరిధిలోనిదేనన్న అంశాన్ని విపక్షాలు గుర్తెరగాలని కెసిఆర్ అన్నారు.
కేంద్రం పైసా ఇవ్వడం లేదు
గొర్రెల పథకంలో కేంద్రం గురించి కూడా చెబితే బాగుండేదని బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ, ఈ పథకానికి కేంద్రం పైసా కూడా ఇవ్వడం లేదన్నారు. సొంత బడ్జెట్ నుంచే తాము 75 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. చేప పిల్లల గురించి మాట్లాడారని చెబుతూ ప్రతిపక్ష సభ్యులు కాగితాలు అడ్డుపెట్టుకుని నవ్వుతున్నారన్నారు. పౌల్ట్రీ రంగంలో దేశంలో మన రాష్ట్రం 30 శాతం ఉందని, ఫార్మా రంగంలో 45 శాతం ఉన్నామని సిఎం వివరించారు. బడాయి బడ్జెట్ అని విపక్షాలు విమర్శించాయని, బిఇ అంటే బడ్జెట్ ఎస్టిమేట్ అని, ఆర్‌ఇ అంటే రివైస్డ్ ఎస్టిమేట్ అని చెప్పారు. బడ్జెట్‌ను భారీగా పెంచామని, మన కొత్త రాష్ట్రాన్ని శపించవద్దని ఆయన విపక్షాలను కోరారు. 108 కులాలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
అక్కసు ద్వేషం లేదు: జానారెడ్డి
ప్రతిపక్ష నేత కె జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తమకు అక్కసు, ద్వేషం లేదన్నారు. 10 వేల కోట్ల లోటు ఉందని అన్నామని, ఉదయ్ పథకంలో దేశంలో 27 రాష్ట్రాలు చేరాయి, అందులో మీరూ చేరారన్నారు. ముఖ్యమంత్రి కల్పించుకుంటూ మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చారు. 840 కోట్ల పన్ను భారం తగ్గిందని ఆయన చెప్పారు. జానారెడ్డి మాట్లాడుతూ 12 వేల కోట్ల రూపాయలు డిస్కాంలకు అప్పుగా ఉన్నట్టు చెబుతూ, ఛార్జీలు పెంచుతారా? అని ప్రశ్నించారు. విద్యుత్ కారిడార్‌కు వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, నష్టం గురించి చెప్పలేదన్నారు. ఎంబిసిలోని 113 కులాలు ఏవో చెప్పాలని అన్నట్టు ఆయన వివరించారు.