రాష్ట్రీయం

కోర్టు ధిక్కార కేసులో విశాఖ మాజీ కమిషనర్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: కోర్టు ధిక్కారణ కేసులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష లేదా 1500 రూపాయల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా 1500 రూపాయల జరిమానా చెల్లించాలని, లేదా 30 రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జస్టిస్ రామచంద్ర రావు ఆదేశిస్తూనే జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. విశాఖ నగరంలో భవన నిర్మాణానికి మున్సిపల్ కార్పోరేషన్ అనుమతించడం లేదని లోగడ జూపిటర్ ఆటోమొబైల్స్ హైకోర్టును ఆశ్రయించగా, అనుమతించాలంటూ కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ అనుమతించకపోవడంతో పిటీషనర్ కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు ఆదేశించింది.