రాష్ట్రీయం

నల్లమార్కెట్‌పై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: నల్లమార్కెట్ నిరోధక చటాన్ని అమలు చేసే విషయమై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు శనివారం ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. నల్లమార్కెట్లోకి నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మకాలను నిరోధించడంలో రెండు రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయని నగరానికి చెందిన టి ధనగోపాలరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను విచారించిన తర్వాత హైకోర్టు ఏప్రిల్ 4వ తేదీలోపల అఫిడవిట్లను దాఖలు చేయాలంటూ రెండు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.