రాష్ట్రీయం

ఫలితాలు నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: శాసనమండలికి ఉపాధ్యాయ పట్ట్భద్రులు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 8 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. తొలిదశలో ఉత్తరాంధ్రలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, కర్నూలు, కడప జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్ట్భద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరాంధ్రలో బిజెపికి, ఇతర నియోజకవర్గాల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు అనుకూల పవనాలు వీచాయి. రెండోదశలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి ఎన్నికలు జరిగాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, కడపలో వైకాపా అభ్యర్థికి అనుకూల వాతావరణం కనిపించింది. అయినప్పటికీ ఈ 8 స్థానాల్లోనూ కడప ఫలితం పైనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని బరిలోకి దింపి, తెలుగుదేశానికి గట్టి సవాల్ విసిరారు. కాగా తెలుగుదేశం పార్టీనుంచి బరిలోకి దిగిన బిటెక్ రవికి మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేశారు. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ విశాఖలోని స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా బిజెపికి చెందిన మాధవ్‌ను బరిలోకి దించాయి. ప్రోగ్రెసివ్ డెమక్రిటివ్
ఫ్రంట్ అభ్యర్థిగా సిపిఎంకు చెందిన అజ శర్మ పోటీ చేశారు. ఆఖరి నిముషంలో అజ శర్మకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. దీంతో ఈ ఎన్నికలో విజయం టిడిపి, బిజెపి, వైకాపాలకు అనివార్యమైంది. ఈ ఎన్నికలో పోటీ అజ శర్మ, మాధవ్ మధ్యే ఉంటుందన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడ్ల ఆదిరాజు, మరో ఇద్దరు ఇండిపెండెంట్‌లు ఓట్లను భారీగా చీల్చే అవకాశాలు ఉన్నందున మొదటి, ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది.
తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చిత్తూరులోని పివికెఎన్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. ఉపాధ్యాయుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సోమవారం రాత్రికి తేలే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల స్థానానికి, పట్ట్భద్రుల స్థానానికి కూడా టిడిపి, పిడిఎఫ్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొని ఉంది.
నెల్లూరులో స్థానిక సంస్థల స్థానానికి పోటీ ప్రధానంగా వాకాటి నారాయణరెడ్డి (టిడిపి), ఆనం విజయకుమార్ రెడ్డి (వైకాపా) ల మధ్యే ఉంటుందని అంచనా.