రాష్ట్రీయం

నువ్వంటే నువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 19:పాలమూరు ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఆదివారంనాడు విలేఖరుల సాక్షిగా రచ్చకెక్కాయి. తనకు మంత్రి పదవి రాకుండా ఎంపి అడ్డుకున్నారంటూ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ధ్వజమెత్తగా రుజువు చేస్తే రాజీనామా చేస్తానంటూ ఎంపి సవాల్ విసిరారు. ఇద్దరు నేతల వివాదం చూసి విలేఖరులతోపాటు అక్కడే ఉన్న పార్టీ నేతలు విస్తుబోయారు. ఎంపి జితేందర్‌రెడ్డి స్వగృహంలో ఆదివారంనాడు టిఆర్‌ఎస్ పాలమూరు నియోజకవర్గ పార్టీ సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓ టీవీ చానల్‌లో తనకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య విభేదాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని, తమ మధ్య ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌గౌడ్ కూడా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కలిసికట్టుగానే పనిచేస్తున్నామని మొదట్లో చెప్పినా, ఆ తర్వాత మనసులో ఆవేదన
వెళ్లగక్కారు. తాను కులానికి చిన్న కావచ్చు కానీ గుణంలో మాత్రం మిన్న అన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా ఎంపి జితేందర్‌రెడ్డి అడ్డుకున్నట్లు ఓ మంత్రి తనకు స్వయంగా చెప్పారని అన్నారు. దాంతో జితేందర్‌రెడ్డి లేచి, ఆ మంత్రెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవుల కేటాయింపు సందర్భంగా ముఖ్యమంత్రి తమతో చర్చించినప్పుడు పాలమూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు కావాలని తానే కోరానని, అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లోకి వచ్చినందున తప్పనిసరిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సిఎం నిర్ణయించారని, లక్ష్మారెడ్డి టిఆర్‌ఎస్ అవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్నందున ఆయనకూ పదవి ఇవ్వాలని భావించారని జితేందర్‌రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రికి సన్నిహితుడినని శ్రీనివాసగౌడ్ పదేపదే చెప్పుకుంటారని, అలాంటి వ్యక్తికి సిఎం మంత్రి పదవి ఇస్తే ఎవరు అడ్డుకుంటారని ఎంపి ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ తాను మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నట్లు రుజువు చేస్తే ఎంపి పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను అజాతశత్రువునని, తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో శత్రువులే లేరని ఎంపి అన్నారు. మంత్రి పదవి అంటే అంత తమాషా కాదని, అదృష్టం కూడా కలసి రావాలన్నారు. శ్రీనివాస్‌గౌడ్ ఏదో అపోహతో మాట్లాడుతున్నారంటూ ఆయన విలేఖరుల సమావేశం నుండి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకుంటూ తాను కావాలని చెప్పడం లేదని, ఓ మంత్రి స్వయంగా చెప్పినందునే ఈ విషయాలను బయటపెడుతున్నానని అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎంపి, ఎమ్మెల్యే మధ్య వివాదం జరగడంతో తెరాస నేతలు కంగు తిన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్