రాష్ట్రీయం

తెలంగాణ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలవడానికి దోహదపడిన పారిశ్రామిక విధానాన్ని ఆయన ఆసక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఐటీ రంగంలో గోవా ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఐటీశాఖ మంత్రి కెటిఆర్ వివరించగా, తమ రాష్ట్రం కూడా ఒప్పందం చేసుకుంటుందని కేరళ సిఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కేరళ సిఎం విజయన్‌ను తన నివాసానికి మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి సిఎం కెసిఆర్ భోజనం చేశారు. అనంతరం వారిద్దరు ఇరు రాష్ట్రాలలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, పథకాల గురించి చర్చించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, పర్యాటక, ఐటీ రంగం, భూ రికార్డుల డిజిటలైజేషన్, శాంతి భద్రతలు తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం (టిఎస్-ఐపాస్) బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ విజయన్‌కు అందజేశారు. తమ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యల వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తికనబరుస్తున్నారని కెసిఆర్ వివరించారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారి వసతి కోసం శబరిమల కొం డపై అతిథి గృహ నిర్మాణానికి ఇప్పటికే కేరళ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ విజయన్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఇప్పటిదాకా అతిథి గృహం నిర్మించడానికి స్థలాన్ని అప్పగించలేదని కెసిఆర్ గుర్తు చేశారు. ఈ అంశం ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉందని ఆయన వివరించగా చొరవ తీసుకొని త్వరగా కేటాయించడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కెసిఆర్ వివరించారు. తెల్లకాగితాలపై భూ క్రయ విక్రయాలు జరిగినా వాటికి చట్టబద్ధత కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాదా బైనామాలకు మంచి స్పందన వచ్చిందని, 11.5 లక్షల దరఖాస్తులు రాగా వాటిని పరిష్కరించినట్టు సిఎం కెసిఆర్ వివరించారు. నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించడానికి ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా విజయన్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

చిత్రం..కేరళ సిఎం పినరయి విజయన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్