రాష్ట్రీయం

తెలుగుదేశం జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిలోనూ టిడిపి కైవసం చేసుకుంది. అయితే ఉపాధ్యాయులు, పట్ట్భద్రుల నియోజకవర్గాల్లో అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష అభ్యర్థులు విజయపథంవైపు దూసుకెళుతున్నారు. అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కడపలో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై బిటెక్ రవి 33 ఓట్లతో గెలిచినప్పటికీ, విపక్ష నేత జగన్ కంచుకోటలో అధికార పార్టీ పాగా వేసినట్లయింది. నెల్లూరులో వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డిపై వాకాటి నారాయణరెడ్డి, కర్నూలులోనూ వైకాపా అభ్యర్థి గౌర వెంకటరెడ్డిపై శిల్పా చక్రపాణి గెలవటం జగన్ శిబిరాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికారపక్షానికి ఊహించినంత సానుకూల ఫలితాలు రావటం లేదు. ఓట్ల సంఖ్య భారీగా ఉండటంతో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా లెక్కింపు కొనసాగుతోంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో కూడిన పట్ట్భద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి ఎంవిఎస్ శర్మపై బిజెపి అభ్యర్థి పివి మాధవ్ 700 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన పట్ట్భద్రుల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠలపు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నారాయణ సంస్థల అభ్యర్థి పట్ట్భా రామిరెడ్డి విజయపథంలో ఉన్నారు. ఇక కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో కూడిన పట్ట్భద్రుల నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. టిడిపి అభ్యర్థి టిజె రెడ్డి, వైసిపి అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డి, సిట్టింగ్ పిడిఎఫ్ అభ్యర్థి గేయానంద్ మధ్య గట్టి పోటీ నెలకొనగా గోపాల్‌రెడ్డి ఆధిక్యతతో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి గెలుపొందారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ వైకాపా అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి టి.పుల్లయ్య ఓటమి పాలయ్యారు.

చిత్రం..కడప ఎమ్మెల్సీగా ఎన్నికైన బిటెక్ రవి