రాష్ట్రీయం

ఇళ్ల అద్దెలు నియంత్రించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: విజయవాడ పరిధిలో ఇళ్ల అద్దెలు భరించలేనంతగా ఉంటున్నాయని, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువులు ఎమ్మెల్సీలు కోరారు. కిందిస్థాయి ఉద్యోగులు అద్దెలు భరించలేక, చెల్లించలేక ఏడుస్తున్నారంటూ మండలి చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. శాసనమండలిలో సోమవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడలో ఇళ్ల అద్దెల గురించి ఎమ్మెల్సీ జి తిప్పేస్వామి ప్రస్తావించారు. డబుల్ బెడ్‌రూమ్‌కు 15వేల రూపాయలు, త్రిపుల్ బెడ్‌రూమ్‌కు 35వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతంలో ఎక్కువమొత్తం అద్దెకు చెల్లించాల్సి వస్తోందని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బాధపడుతున్నారన్నారు. గుంటూరు, విజయవాడల్లో అద్దెలను నియంత్రించకపోతే ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేరదన్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ అద్దె, దోమల బాధను తామే భరించచలేకపోతున్నామని, కిందిస్థాయి ఉద్యోగుల ఎలా భరిస్తారన్నారు. దీనిపై చైర్మన్ చక్రపాణి స్పందిస్తూ తాను రైల్వేస్టేషన్ దగ్గర ఒక ఫ్లాట్‌ను 25 వేల రూపాయల అద్దెకు తీసుకున్నానని తెలుపగా, తమకూ తక్కువ అద్దెకు ఇళ్లు చూడాలని కొందరు సభ్యులన్నారు. సభ్యుల ఆవేదనపై స్పందించిన రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం 1960 రూపొందించిన రెంట్ కంట్రోల్ చట్టం అమల్లో ఉందన్నారు. దీనిపై 2015లో కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ముసాయిదా రూపొందించామని, త్వరలో కొత్త చట్టం తీసుకొచ్చి అద్దెలను నియంత్రిస్తామన్నారు. దోమలకు అధికార పక్షం అనే పక్షపాతం లేకుండా అందరినీ కుడుతున్నాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి.
చంద్రన్న బీమాకు సంబంధించి క్లెయిములు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ, ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలో వివిధ ధ్రువీకరణ పత్రాల అవసరమని, దీనివల్ల కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. వీలైనంత త్వరగా బీమా క్లెయిములను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో కంటింజెంట్ వర్కర్ల సంఖ్య, తదితర అంశాలపై ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ స్పందిస్తూ, గత ఏడాది అక్టోబర్ నుంచి వారికి జీతాలను పెంచామని తెలిపారు.
కోళ్ల ప రిశ్రమకు కొత్త విధానం
కోళ్ల పరిశ్రమ ఏర్పాటు సంబంధించి కొత్త విధానాన్ని నెలరోజుల్లో ప్రకటించనున్నామని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కోళ్ల పరిశ్రమ ఏర్పాటు విధానాన్ని రూపొందించారా? అని ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ పౌల్ట్రీ పెద్ద పరిశ్రమగా మారిందని తెలిపారు. ఎక్కువమందికి ఉపాధి కలిగిస్తున్న పరిశ్రమ అని, కోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కొత్త విధానాన్ని రూపొందించేందుకు కమిటీని నియమించినట్లు తెలిపారు.