రాష్ట్రీయం

దిద్దుబాటలో తెరాస?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20:తెలంగాణ ఆవిర్భావం , టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. అయితే కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల పనితీరు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండడంతో దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు. 68శాతం ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించారు, అదే సమయంలో పలు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అలాంటి నియోజక వర్గాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ నియోజక వర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై ఇప్పటి నుంచే దృష్టిసారిస్తేనే కారు స్పీడ్‌కు తిరుగుండదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయి. ఇంకా రెండేళ్ల కాలంలో ఎన్నికలు ఎదుర్కోవాలి. చివరి ఏడాది మొత్తం ఎన్నికల హడావుడి ఉంటుందని, ఏం చేసినా ఈ ఏడాదిలోనే మార్పులు చేర్పులు చేయాలని నాయకత్వం భావిస్తోంది. ఉద్యమ కాలంలోని వాతావరణం వల్ల కొందరు గెలిచినా ఇప్పుడు తిరిగి వారికే టికెట్ ఇస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. 68శాతం ఓటర్లు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించినప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు విజయం సాధించాలంటే దిద్దుబాటు తప్పదని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
ఈనెల 21న వరంగల్‌లో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతుంది. ఈ ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి వివరించనున్నారు. తిరిగి పార్టీ ఘన విజయం సాధించాలంటే కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవలసిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
33 నెలలు గడిచిపోయిన తరువాత కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. గతంలో ఈ విభేదాలు బయటపడినా ముఖ్యమంత్రి వౌనంగానే ఉన్నారు. తిరిగి మరోసారి బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. మరోవైపు ఉద్యమంలో పాల్గొన్న వారికి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన వారికి మధ్య చాలా ప్రాంతాల్లో
కోల్డ్ వార్ నడుస్తోంది. టిడిపి నుంచి గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమావేశం నిర్వహిస్తే, ఉద్యమ కాలం నుంచి ఉన్నవారికి తీగల కృష్ణారెడ్డితో పాటు పార్టీలోచేరిన వారికి మధ్య ఘర్షణ జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వరంగల్‌లో ఈనెల 27న టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతుంది. ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీకి కొత్త రూపం ఇచ్చే నిర్ణయం తీసుకుంటారు.
ప్లీనరీ తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. అదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు ఏ మాత్రం బాగాలేదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్లీనరీలో పార్టీకి కొత్త కార్యవర్గం ఏర్పాటు అవుతుంది. ఎన్నికల వరకు ఇదే కార్యవర్గం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొందరు ఎమ్మెల్యేలకు సైతం పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్లీనరీకి సన్నాహాలు
:టిఆర్‌ఎస్ ప్లీనరీని ఈసారి వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా నాయకులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సమావేశం అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుడు తక్కెలపల్లి రవీందర్‌లతో సమావేశం అయ్యారు. ప్లీనరీ ఏర్పాట్లు, సభ్యత్వ నమోదు, జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. నిర్ణయించారు.