రాష్ట్రీయం

కోడ్ ముగియగానే రోడ్లపైకి కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రంలో ఇంకా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు 13 వందల వరకూ ఉన్నాయని అసెంబ్లీలో రవాణా మంత్రి పి మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆయా గ్రామాలకు త్వరలోనే బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాటిని ఇంకా ప్రారంభించలేదని వెల్లడించారు. కోడ్ ముగియగానే సౌకర్యం లేని గ్రామాలకు కొత్త బస్సులు రోడ్డెక్కుతాయని ప్రకటింరు. సోమవారం శాసన సభలో రవాణా శాఖ పద్దులపై చర్చకు సమాధానం చెబుతూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. శాసన మండలి ఎన్నికల కోడ్‌ఉందని, దీని కోసమే బస్సులు ఇంతవరకూ ప్రారంభించలేదని చెప్పారు. చిన్న బస్సులు, పెద్ద బస్సులు రెండూ ఉన్నాయన్నారు. 1600 కొత్త బస్సులు ఒకేసారి ప్రారంభించనున్నట్టు సభకు వివరించారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఆర్టీసికి చెందిన ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదాయం పెంచే మార్గాలు అనే్వషిస్తున్నట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయనున్నామని, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొస్తామని చెప్పారు.
లక్ష సిసి కెమెరాలు: నాయని
హైదరాబాద్ నగరంలో లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సోమవారం శాసనసభలో తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం జరుగుతోందని, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటనలు తమ దృష్టికి వచ్చినప్పుడు పోలీసులతో మాట్లాడినట్టు చెప్పారు. వారంతా పేదవారిని కేసులు పెట్టవద్దని చెప్పినట్టు తెలిపారు. కొందరు ఎస్‌ఐలు ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని హోంమంత్రి తెలిపారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, నివారణా చర్యల కోసం అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో పోలీసు శాఖ పని తీరు బాగుందని, కేంద్ర ప్రభుత్వం సైతం అనేకసార్లు అభినందించిందని హోంమంత్రి తెలిపారు. నేరాల నివారణ కోసం పోలీసులకు వాహనాలు సమకూర్చినట్టు, లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.