రాష్ట్రీయం

దండం పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకోవద్దంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై సోమవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేవలం శంకుస్థాపనలకే ప్రాజెక్టులను పరిమితం చేశారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును తమ ప్రభుత్వం చేపడితే,కాంగ్రెస్‌కు చెందిన హర్షవర్దన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి తప్పుడు సమాచారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అడవి తరగిపోతోందని, పులులకు గడ్డుకాలం వస్తుందని హర్షవర్దన్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు చెప్పారని గుర్తు చేస్తూ, కాల్వ వెళ్లే మార్గంలో తొండలు కూడా గుడ్లు పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతలను 1999లో చేపట్టి 2014 వరకు నత్తనడక నడిపించారని, పదిహేనేళ్లలో ఎన్ని నిధులిచ్చారో, ఒకే ఏడాదిలో తాము అంతకుమించి వెయ్యికోట్లు ఇచ్చిన విషయాన్ని మరువకూడదన్నారు. దాంతో ఈ ఏడు 1.6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగామన్నారు. బీమా ఎత్తిపోతల ద్వారా తమ ప్రభుత్వం ఈ ఏడాది 160 చెరువులు నీటితో నింపిందని, 1.4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు.
మల్లన్న సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును చేపడితే సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కెకె మహేందర్ కేసు వేశారన్నారు. చనిపోయిన రైతుల పేర్లతో మహేందర్ పిటీషన్ దాఖలు చేశారని ఆరోపించారు. మల్లన్నసాగర్ వల్ల 50 టిఎంసి జలాలు వినియోగించుకునే వీలు కలిగిందని, అలాంటి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. కాంగ్రెస్ ద్వంద్వవైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. బహుళ ప్రయోజనాలు కలిగే మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటూ, మరోవైపు పెద్దగా ప్రయోజనం లేని తోటపల్లి ప్రాజెక్టు కోసం డిమాండ్ చేయడం ఏ తరహా రాజకీయమని నిలదీశారు. దాదాపు ఆరులక్షల ఎకరాలకు సాగునీరు అందించే మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటూ, పదివేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేని తోటపల్లిపై మంకుపట్టు పట్టడంలో ఔచిత్యం ప్రజలకు తెలుసునని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్టును చేపట్టారని, దానివల్ల ఆరు గ్రామాలు, 3500 ఎకరాలు ముంపునకు గురవుతాయని, ఇంతా చేస్తే కేవలం 0.95 టిఎంసి జలాలు మాత్రమ వినియోగించుకునేందుకు వీలవుతుందన్నారు. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉపసంహరించినట్టు మంత్రి వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నుంచి వరదవచ్చే సమయంలో రోజూ రెండు టిఎంసి నీళ్లు కరవుపీడిత ప్రాంతాలకు తరలించే వీలవుతుందని హరీశ్‌రావు వివరించారు. మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రాజెక్టు ద్వారా 16.4 లక్షల ఎకరాలకు జలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు.