రాష్ట్రీయం

ఎస్సీ, ఎస్టీలకు అభివృద్ధి నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర బడ్జెట్ నిర్మాణం మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ప్రణాళిక పద్దును బడ్జెట్ ప్రతిపాదనల నుంచి తొలగించారు. దీంతో ఉప ప్రణాళికకు కేటాయించే నిధులు ఇకనుంచి ప్రత్యేక నిధి కింద కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రూపొందించింది. బిల్లుపై మంగళవారం ప్రగతి భవన్‌లో సిఎం కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి చర్చించిన అనంతరం ఆమోదించింది. దీంతో శాసనసభలో బుధవారం బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులుండేవి. ప్రస్తుతం మారిన బడ్జెట్ స్వరూపంతో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు రెండు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు కేటాయించే నిధులను ప్రణాళికేతర పద్దు కింద చూపెట్టేవారు. ఈ పద్దులను బడ్జెట్ నుంచి తొలగించడంతో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదించింది.
వరంగల్‌లో తెరాస ఆవిర్భావ సభ
తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు మంగళవారం మంత్రిమండలి భేటీలో రాజకీయ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా సిఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభ అద్భుతంగా జరిగిందని, అదేస్థాయిలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించినట్టు వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వహయాంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆవిర్భావ సభను వేదికగా చేసుకోవాలని నిర్ణయించినట్టు సిఎం చెప్పారు. వరంగల్‌లో సభ జరపడానికి ముందే హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసి అందులోనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియతో పాటు ప్లీనరీలో చర్చించే అంశాలు, చేయబోయే తీర్మానాలపై కసరత్తు చేయాల్సిందిగా మంత్రులకు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది.