తెలంగాణ

ఏపిఏటి రిటైర్డు సభ్యుల బిల్లులను చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిటైర్డు సభ్యుల వైద్య ఖర్చు బిల్లులను జనాభా నిష్పత్తి మేరకు 58:42 పద్ధతిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం కె శ్రీనివాస్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఏపిఏటి రిటైర్డు సభ్యులు వైద్య ఖర్చులను చెల్లించడంలో రెండు రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరిపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ బిల్లులను ఏపిఏటి చైర్మన్‌కు సమర్పించాలని, పది రోజుల్లోగా రెండు రాష్ట్రప్రభుత్వాలు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. ఈ అంశంపై రెండు రాష్ట్రప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.