రాష్ట్రీయం

గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: గోల్కొండ వద్ద గోల్ఫ్‌కోర్స్‌కు అనుమతి ఇవ్వడంపై హైదరాబాద్ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శమీమ్ అఖ్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ డాక్టర్ లుబ్న సర్వత్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. గోల్కొండ కోటకు సంబంధించిన నయాక్వాలీ గోడలను ఉపయోగించుకుని నిబంధనలకు వ్యతిరేకంగా 50 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ నిర్మించారని పిటిషన్‌లో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ గోల్ఫ్ కోర్స్ నిర్మించారు. సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన కోర్టు కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.
డ్రైవర్లు ఎన్ని గంటలు పని చేయాలి?
ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ఎన్ని గంటలు పని చేయాలో వివరంగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. దివాకర్ ట్రావెల్స్‌తోపాటు ఇతర వాహనాల డ్రైవర్లకు సంబంధించిన పని గంటలు వివరాలు చెప్పాలని కోరారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లో కెవి సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మూలపాడు గ్రామం వద్ద ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదానికి కారకులపై చర్య తీసుకోవాలని పిటిషనర్ కోరారు.