జాతీయ వార్తలు

దక్షిణ మధ్య రైల్వేకు ‘గ్రీన్‌కో-సిల్వర్ రేటింగ్’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికిందరాబాద్‌లోని లాలాగూడ రైల్వే క్యారేజ్ వర్కుషాప్‌కు ‘గ్రీన్‌కో-సిల్వర్ రేటింగ్’ అవార్డు లభించింది. కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో భారత రైల్వే శాఖ ఈ అవార్డును ప్రకటించింది. బుధవారం న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి సురేష్ భు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, ఇంధనం, విద్యుత్, నీటి వినియోగంతోపాటు పలు విభాగాల్లో మంచి ఫలితాలు సాధించిన లాలాగూడ వర్కుషాప్‌కు దేశంలోనే ప్రథమ ఉత్తమ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాల నిర్వహణలోనూ దక్షిణ మధ్య రైల్వే ముందుందన్నారు. ఇది రైల్వే సిబ్బంది, అధికారుల కృషి ఫలితమేనన్నారు. 2016-17 పర్యావరణ హిత విధానాల ద్వారా రూ. 40 లక్షలు ఆదా చేయడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో 2017-18లో దక్షిణ మధ్య రైల్వేలో పలు సంస్కరణలు చేపట్టి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని జిఎం పేర్కొన్నారు.