తెలంగాణ

యూనిట్‌కు రూ. పది అడిగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని, బిజెపి సభ్యులనుద్దేశించి బుధవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. దీంతో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకుని వెళ్ళగా, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ తన స్థానం వద్దే నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలతో, దూషణలతో సభ అట్టుడికింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దశలో మంత్రి కె. తారక రామారావు పోడియం వద్దకు వచ్చి కిషన్‌రెడ్డికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, వారు వినిపించుకోలేదు. అయినా మంత్రి జగదీష్‌రెడ్డి తాను తప్పు మాట్లాడలేదని, తప్పు మాట్లాడినట్లు రికార్డుల్లో ఉంటే ముక్కు నేలకు రాస్తానని, వారు తప్పుగా మాట్లాడితే ముక్కు నేలకు రాయాలంటూ సవాలు విసిరారు. పైగా కిషన్‌రెడ్డిని ఉద్దేశించి ‘కూసోపో, నీ కంటే మంచిగ మాట్లాడాను, నేను నీ బెంచ్ కాడికి వచ్చి మాట్లాడలేదు..’ అంటూ ఆగ్రహంగా అన్నారు. ఇలాఉండగా సభ వాయిదా పడిన అనంతరం స్పీకర్ మధుసూదనాచారి రికార్డులను పరిశీలించారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే లక్ష్మణ్ మీడియాకు చెప్పారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం అసెంబ్లీలో విద్యుత్తు బిల్లు (పద్దు)పై చర్చ జరిగింది. చర్చకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యుత్తు చార్జీల విషయంలో ఇఆర్‌సి సూచనలు చేసినా, పేద, సాధారణ ప్రజలపై భారం పడనీయమని అన్నారు. ‘ఉదయ్’లో ఏమీ లేదని ఆయన తెలిపారు. ఉదయ్‌లో చేరితే మాకు లాభం ఏమిటని ప్రశ్నించామని అన్నారు. గ్రాంట్ ఒక్క పైసా కూడా ఇవ్వరట, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్య రూపుమాపామని, మీ పార్టీ కొత్తగా అధికారం చేపట్టిన రాష్ట్రంలో ఆరు నెలల్లో ఇస్తారేమో చూసుకోవాలన్నారు.
‘తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఏమి చేశారు?, మీరేమి చేశారు?’ అని మంత్రి బిజెపి ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లు ఏడు మండలాలు ఆంధ్రకు ఇచ్చేశారని, లోయర్ సీలేరు వెనక్కి తీసుకుని రండి అని అన్నారు. ‘అంతెందుకండీ మీరు గమ్మత్తు చేస్తారు, రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలో విద్యుత్తు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టిపిసి జడ్జర్‌లో పవర్ ఉంది మాకు ఇవ్వండని అడిగితే, పది రూపాయలకు యూనిట్ ఇస్తామన్నారు. మార్వాడీల కంటే ఎక్కువ అధ్వాన్నంగా మాట్లాడారు..’ అని మంత్రి ధ్వజమెత్తడంతో బిజెపి సభ్యులు కిషన్ రెడ్డి, ప్రభాకర్ వెల్‌లోకి దూసుకెళ్ళారు. లక్ష్మణ్ తన స్థానం వద్దే నిలుచుని నిరసన తెలిపారు. కిషన్‌రెడ్డి దూసుకెళ్ళి ట్రెజరీ బెంచ్ వైపు నిలుచుని పెద్దగా విమర్శించసాగారు. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ‘కూసోపో, నీ కంటే మంచిగ మాట్లాడాను, నీ బెంచ్ కాడికి వచ్చి మాట్లాడలేదు..’ అని అన్నారు. బిజెపి సభ్యులకు నచ్చజెప్పేందుకు మంత్రి కెటిఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు కల్పించుకుని ప్రధాని అంటే తమకు గౌరవం ఉందని అన్నారు. సభ్యులు ఏదైనా చెప్పాలనుకుంటే తమ స్థానాల్లోకి వెళ్ళి మైకులో చెప్పాలని ఆయన కోరారు.
ముక్కు నేలకు రాస్తా
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద వారిని కించపరిచినట్లు రికార్డుల్లో ఉంటే క్షమాపణ చెబుతానని అన్నారు. తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. బిజెపి సభ్యులు ఉపయోగించిన భాషలో తప్పుంటే వారు ముక్కు నేలకు రాస్తారా? అని ప్రశ్నించారు.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్ళాలని కోరారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ సభను స్తంభింపజేయడం భావ్యం కాదని అన్నారు. కిషన్‌రెడ్డి సీనియర్ సభ్యుడై కూడా ఇలా రావడం సమంజసం కాదని అన్నారు. లక్ష్మణ్ కల్పించుకుని మీరూ సీనియర్ మంత్రి అయి ఉండి కూడా తోటి మంత్రికి ఇలా మాట్లాడడం సరైంది కాదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పద్దులను మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను గురువారానికి వాయిదా వేశారు.
సిఎం పరిశీలన
అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన రికార్డులను సిఎం కెసిఆర్ తన నివాసానికి తెప్పించుకుని పరిశీలించారు.