ఆంధ్రప్రదేశ్‌

ఇంట ఓడి రచ్చ గెలిచిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: ఎవరైనా ఇంట గెలిచి రచ్చ ఓడుతుంటారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంట ఓడి రచ్చ గెలిచారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, తన సొంత జిల్లా కడపలో సొంత బాబాయిని గెలిపించుకోలేని నేతగా అపఖ్యాతి మూటకట్టుకున్న జగన్.. టీచర్లు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మాత్రం తన పార్టీతోపాటు, తాము మద్దతునిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజాభిమానం తమకే ఉందని చాటుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన వామపక్షాలతో, ముఖ్యంగా సీపీఎంతో పెట్టుకున్న ముందస్తు స్నేహం ఫలించింది. పిడిఎఫ్ బలం గ్రహించిన జగన్, తెలివిగా టీచర్ల నియోజకవర్గాల్లో మద్దతునిచ్చి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో వారి మద్దతు తీసుకున్నారు. కర్నూలులో పార్టీ ఓడినప్పటికీ, అక్కడ క్రాస్ ఓటింగ్ చేయించడం ద్వారా తెదేపా మెజారిటీని తగ్గించగలిగారు. కాగా, భవిష్యత్తులో వామపక్షాలతో కలసి వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొన్న లక్షలాది మంది ఓటర్లు విపక్షాలకే జై కొట్టడం ద్వారా, ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన జగన్.. కీలకమైన మరిన్ని ప్రజా సమస్యలు గుర్తించి వామపక్షాలతో కలసి పోరాడాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోవడం పార్టీకి నష్టం కలిగించినా, వ్యక్తిగతంగా జగన్ మరింత రాటుతేలేందుకు, పార్టీపై మరింత దృష్టి పెట్టేందుకు ఒకరకంగా లాభం కలిగించేదేనని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. పార్టీ లోటుపాట్లను విశే్లషించుకుని, సమర్థులైన నేతలను గుర్తించేందుకు ఇదొక అవకాశంగా భావించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ‘కడపలో పార్టీ ఓడినప్పుడు జగన్ ఎలా ఉన్నారో, టీచర్-గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేం గెలిచినప్పుడూ అలాగే ఉన్నారు. ఇరిగేషన్, పవర్ అంశాలపై గట్టిగా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే జగన్ బాగా రాటుతేలుతున్నారని అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఒకందుకు మంచిదే. లోపాలు సవరించుకుని ముందుకు వెళ్లేందుకు అది సాయపడుతుంద’ని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.