తెలంగాణ

పురాతన విగ్రహం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, మార్చి 22: పురాతన విగ్రహాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఎఎస్పీ రాహుల్ హెగ్డే, మంగపేట ఎస్‌ఐ ఆరకూటి మహేందర్ తెలిపారు. బుధవారం మంగపేట పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని కమలాపురం గుడ్డేలుగులపల్లి ప్రాంతానికి చెందిన రాణిమేకల రాంబాబు, వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన డెక్కా సత్యనారాయణ అనే వ్యక్తిని మంగపేట మండలంలోని కమలాపురంనకు చెందిన పెద్ది పెద్దన్న, నాగిశెట్టి రామారావు అనే వ్యక్తులకు 2016 డిసెంబర్‌లో పరిచయం చేశాడు. డెక్కా సత్యనారాయణ ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా జైపూర్ వద్ద 5 కిలోల పురాతన బంగారు విగ్రహం ఉందని చెప్పి అక్కడకు రామారావుని, పెద్దన్నను తీసుకువెళ్లాడు. విగ్రహంలో సుమారు 40 శాతం బంగారం ఉందని తెలపడంతో పెద్దన్న, రామారావు ఆ విగ్రహాన్ని బేరం పెట్టారు. అందులో భాగంగా పెద్దన్న లక్షా 50 వేలు, రామారావు లక్ష రూపాయిలు ఇచ్చి విగ్రహాన్ని తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని స్థానికంగా, గుంటూరులో పరిశీలన చేయించగా ఆ విగ్రహం రాగి, జింక్‌తో తయారుచేసిందని తెలవడంతో ఆ విగ్రహాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం కమలాపురం అంబేద్కర్ సెంటర్‌లో మంగపేట ఎఎస్‌ఐ పిట్టా శ్యాంసుందర్‌కు ఈ. పెద్దన్న, నాగిశెట్టి రామారావు, రాణిమేకల రాంబాబు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా వారి వద్ద విగ్రహం కనబడింది. విగ్రహం స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విగ్రహం లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని పోలి ఉందని పోలీసులు తెలిపారు. మరో నిందితుడి ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు.