రాష్ట్రీయం

శే్వతపత్రాలపై అవాకులు కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తాజాగా ఇసుక విధానం, బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన శే్వతపత్రాలపై విమర్శలు చేయడం సరైందికాదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అవినీతి డబ్బుతో ఏర్పాటైన మీడియాకు అలాగే అలాంటి రాజకీయ పార్టీలకు ఎప్పుడూ అవినీతి ఆలోచనలే తప్ప వాస్తవాలు ఎలా రుచిస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వైఎస్ 2007లో హడావుడిగా తన బినామీ పెన్నా ప్రతాపరెడ్డితో బినామీ గ్రూప్‌ను ఏర్పాటుచేయించి రూ.22,400 కోట్లు విలువైన 224 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. చింతపల్లి మండలంలో 1649 ఎకరాల్లో ఘనుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది వైఎస్ ప్రభుత్వం కాదా? అన్నారు. 2000లో దుబాయి కంపెనీకి బాబు ప్రభుత్వం బాక్సైట్ ఖనిజం తవ్వకాలు లీజుకు ఇచ్చినట్లు లీజు చూపించగలరా లేదా వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను చూపించమంటారా అని మంత్రి సవాల్ చేశారు.
2000లోనే తన ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందో నాటి సిఎం చంద్రబాబు బాక్సైట్‌పై స్పష్టం చేసినా దాన్ని ప్రచురించకుండా వక్రీకరించి బురద జల్లడాన్ని ఏమనాలి అన్నారు. రస్-అల్-కైమా ప్రభుత్వం పెన్నా గ్రూపుతో కలిసి అన్‌రాక్ అల్యూమినియం కంపెనీని 2007లో ఏర్పాటుచేసినప్పడు సిఎం వైఎస్ కాదా? బాక్సైట్ సరఫరా ఒప్పందం చేసుకుంది వైఎస్ హయాంలో అయితే ఈ ఒప్పందం అన్‌రాక్‌కు, వైఎస్ బినామీ పెన్నా గ్రూపుల మధ్య జరగలేదా అని ప్రశ్నించారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి సూచనలను బేఖాతరు చేసి జెర్రెల గ్రూపు నుంచి సరఫరా అయ్యే మొత్తం బాక్సైట్‌ను రస్-అల్-కైమాకు ఏకపక్షంగా కేటాయించారని అన్నారు.
2007 ఫిబ్రవరి 9న జరిగిన సమావేశం మినిట్స్ బుక్ చూస్తే అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వానికి వచ్చే రాయల్టీని అతి తక్కువగా నిర్ణయించి గండి కొట్టారని ఆయన ఆరోపించారు. గిరిజన సంక్షేమం కోసం కేవలం 0.5 శాతం మాత్రమే కేటాయించటం వారిపై వున్న ప్రేమ ఎలాంటిదో అర్ధమవుతుందన్నారు. బాక్సైట్ మైనింగ్ కోసం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండో దశ అనుమతులు కోరటం జరిగిందన్నారు. పెన్నా ప్రతాపరెడ్డి వ్యాపారాలకు, జగన్ వ్యాపారాలకు లింక్ వున్న మాట నిజం కాదా అని ఆయన నిలదీశారు. వాస్తవాలు ఇలా ఉండే జనాన్ని నమ్మించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని యనమల ఆరోపించారు.