రాష్ట్రీయం

మాతృభాషను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జనవరి 8:మాతృభాషను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంటు సభ్యులందరు నిలదీయాలని శాసనసభా ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ పతాకాన్ని ఆవిష్కరించి రచయితల వ్యవస్ధాపక సంఘం అధ్యక్షుడు నాగభైరవ కోటేశ్వరరావు చిత్రపటానికి, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రప్రభుత్వాలు తెలుగుభాషను కించపరిచేవిధంగా, తెలుగువారిని ఇబ్బందులు పట్టేవిధంగా ప్రవర్తిస్తుంటే కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. తమిళనాడులో తమిళుళ తరువాత అత్యధికంగా తెలుగువారు ఉన్నారని వారందరికీ తెలుగుభాషపై మామకారం ఉన్నప్పటికీ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో తెలుగును చేర్చకుండా అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పార్లమెంటు సభ్యులందరు వివిధ రాష్ట్రాల్లో తెలుగుప్రజలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. చివరకు ఎర్రచందనం దొంగలను వదిలిపెడితే తెలుగుభాషకు అవకాశం ఇచ్చేవిధంగా తమిళనాడు ప్రభుత్వం మాట్లాడటాన్ని తప్పుపట్టారు. తెలుగు భాష పరిరక్షణకోసం ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు. తెలుగుపట్ల భావితరాలు వారు మక్కువపెంచుకోవాలన్నారు. పాఠశాలలు, కాలేజిల్లో భాషాఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే రణరంగాన్ని తలపిస్తున్నాయని బుద్ధ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా మధురమైన భాష కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభా గౌరవాన్ని కాపాడాల్సిన సభ్యులే నీచంగా మాట్లాడుతుంటే మిగిలిన వారంతా బాధపడాల్సివస్తోందన్నారు. శాసనసభా తీరుతెన్నులు -శాసనసభ్యులు ఎలా నడుచుకోవాలనే అనే అంశాలపై స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన సమావేశాలను ఏర్పాటుచేశారని చెప్పారు.