రాష్ట్రీయం

అప్పులే..ఆస్తులు పెరగడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి గాని ఆస్తులు పెరగడం లేదని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. 2014 జూన్ నాటికి రూ.79,880 కోట్ల అప్పులు ఉంటే 2017 నాటికి లక్షా 37 వేల కోట్లకు పెరిగాయని, అదేస్థాయిలో ఆస్తులు మాత్రం పెరగలేదని అన్నారు. 2017-18 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్షా 49 వేల కోట్లకు పెరిగితే, ఈ నిష్పత్తిలో ప్రాజెక్టులపై ఎవరు ఎంత ఖర్చు చేశారో కూడా చూడాల్సి ఉంటుందని అన్నారు. బుధవారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరుల సమవేశంలో మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న 34 ప్రాజెక్టులు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయనే విషయం రికార్డులు చూస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చెపితే నమ్మేంత అమాయకులు కారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని గతంలోనే చెప్పామని, అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ కృషిని తక్కువ చేసి టిఆర్‌ఎస్ మంత్రులు, నేతలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు.