రాష్ట్రీయం

పంచాయతీ వ్యవస్థతోనే గ్రామీణాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, (రాజేంద్రనగర్), మార్చి 23: గ్రామీణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధి పంచాయతీ వ్యవస్థతోనే ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సుజనాచౌదరి అన్నారు. గురువారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్డీ)లో గ్రామీణ నవకల్పనల అంకుర సంస్థల రెండు రోజుల సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతుల్లో ఆర్థిక అవగాహన పెంచడానికి ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైతులు ఏ సీజన్‌లో ఏ పంట వేస్తే లాభాలు వస్తాయో తెలుసుకోవాలన్న చౌదరి.. ఖర్చులపట్ల అవగాహన లేకుండానే పంటలను వేస్తున్నారన్నారు. అయతే రైతులు ఉచితంగా వచ్చే లాభాలను ఆశించరని, అలాంటి మంచి ప్రవర్తన ఉన్న రైతులకు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ఉచిత రుణమాఫీల వంటి పథకాలను ఎర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమలు చేస్తున్న వివిధ పథకాల కింద వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, రైతుల సుస్థిర అభివృద్ధికి దోహదం చేయడం లేదని వెల్లడించారు. కాగా, మన పాలకులు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారనీ.. అదే విధంగా నీటి భద్రత చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు రిజర్వాయర్లు, నదుల నుంచి సకాలంలో నీటిని ఇస్తే కరవును పారద్రోలడానికి వీలవుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారన్న ఆయన స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికీ అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయామన్నారు. ప్రతి రోజు వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లినప్పుడే వ్యాపారంలో రాణించగలుగుతామన్నారు. తనకు వ్యాపార రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘంగా అనుభవం ఉందని, అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు. అనంతరం ఎన్‌ఐఆర్డీ డైరెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి ఎన్‌ఐఆర్డీ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు గ్రామాలకు చేరవేసినప్పుడే గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఎన్‌ఐఆర్డీలో ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శన స్టాల్‌లను మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సాంకేతిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ బహుమతిగా లక్ష రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా 50 వేల రూపాయల నగదును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్డీ అధికారులు, శాస్తవ్రేత్తలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న సుజనా చౌదరి