బిజినెస్

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌పై ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టర్ల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, మార్చి 23: దేశవ్యాప్తంగా సరుకులను రవాణా చేసే లారీలపై ఏకపక్షంగా 50 శాతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను పెంచుతూ బీమా రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఐఆర్‌డిఎ) తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గురువారం వివిధ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌లు డి మాండ్ చేశాయి. ఈ మేరకు హైదరా బాద్‌లోని బషీర్‌బాగ్ ప్రాంతంలోని పరిశ్రమల భవన్‌లో ఉన్న ఐఆర్‌డిఎ కార్యాలయం ముందు అనేకమంది లారీ యజమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు ధర్నా చేపట్టారు. అనంతరం తమ డిమాండ్‌ను అంగీకరించాలని కోరుతూ ఐఆర్‌డిఎ చైర్మన్ టిఎస్ విజయన్‌కు వినతి పత్రం సమర్పించారు. పెంచిన యాబై శాతం థర్ట్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను ఉపసంహరించకోకపోతే ఈ నెల 30 నుంచి దక్షిణాది రాష్ట్రాలలో నిరవధిక సమ్మెను మొదలు పెడతామని, అయినప్పటికి ఐఆర్‌డిఎ దిగిరాకపోతే వచ్చే ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెను ప్రారంభించగలమని వివిధ అసోసియేషన్ల నాయకులు హెచ్చరించారు. ధర్నా అనంతరం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో వారు విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఎకె అగర్వాల్, కార్యదర్శి అజయ్ కుమార్‌బన్సాల్‌తోపాటు జంట నగరాలు, జిల్లా సంఘాల ప్రతినిధులు, తెలంగాణ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగర్వాల్ మాట్లాడుతూ ఐఆర్‌డిఎ ప్రైవేటు భీమా సంస్థలతో కుమ్ముకై ఇప్పటికే గడిచిన పది సంవత్సరాలలో ఐదుసార్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను పెంచిందని, నిరుడు 30 శాతం వరకు ఇన్సూరెన్స్‌ను పెం చిందని, ఇంత వరకు తమ పరిశ్రమల్లో ఇంతటి దుర్భర పరిస్థితులు ఎపుడు దాపురించలేదని మండిపడ్డారు. ఇలా 50 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్సూరెన్స్ పెంచడం కారణంగా ఒక్కొక్క లారీపై కనీసం 40 వేల రూ పాయల భారం పడుతుందన్నారు. నిరుడు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. గూడ్స్ ట్రాన్స్‌పోర్టు రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న కోటి లారీలపై ఆధారపడి 14 కోట్ల మంది జీవిస్తున్నారని, వారి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.