రాష్ట్రీయం

హెచ్‌సిఎ నిధులు ‘ఫలహారం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నాలుగు రోజులకు అల్పాహారం, భోజనం నిమిత్తం రూ. 75.78 లక్షలు ఖర్చు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం కెపాసిటీలో 25 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. హెచ్‌సిఏ వ్యవహారాలపై తాము పరిశీలించిన అంశాలను హైకోర్టుకు తెలియచేస్తూ, హైదరాబాద్‌లో ఐపిఎల్ 2017 మ్యాచ్‌ల నిర్వహణకు పర్యవేక్షకుడు లేదా పరిశీలకుడిని నియమించాలంటూ బిసిసిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నాలుగు రోజుల మ్యాచ్ సందర్భంగా హెచ్‌సిఏ అనవసరంగా నిధులు ఖర్చుపెట్టిందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తెలంగాణలో యువతకు క్రికెట్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఈ సొమ్ము ను ఉపయోగించి ఉండాల్సిందని పేర్కొం ది. మ్యాచ్ జరిగిన
నాలుగు రోజుల పాటు రోజుకు రెండు వేల మంది పోలీసులను స్టేడియంలో నియమించారని, ఈ విషయాన్ని కూడా హెచ్‌సిఏ పట్టించుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఎంత మంది అవసరమో కూడా హెచ్‌సిఏ గుర్తించలేకపోయిందంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. పైగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కు ఇంత పెద్ద మొత్తంలో సొమ్మును ఖర్చుపెట్టడాన్ని సమర్ధించుకోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. స్టేడియం కెపాసిటీ 39 వేల సీట్లు అయితే, హెచ్‌సిఏ దాదాపు 11500 కాంప్లిమెంటరీ పాస్‌లు ఇచ్చిందని బిసిసిఐ కోర్టుకు తెలిపింది. కాగా హెచ్‌సిఏ మాత్రం తాము 3860 కాంప్లిమెంటరీ పాస్‌లు ఇచ్చామని, జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ సిఫార్సుల మేరకు పది శాతం లోపు పాస్‌లు ఇచ్చామన్నారు. బిసిసిఐ సూచనల మేరకు ఐదు వేల మంది విద్యార్ధులకు పాస్‌లు ఇచ్చామని హెచ్‌సిఏ కోర్టుకు తెలిపింది.