రాష్ట్రీయం

2 రకాల లైసెన్సులతో కొత్త అబ్కారీ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23:రాష్ట్ర ప్రభుత్వం కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారికి 500 మీటర్ల దూరం లోపు ఉన్న దుకాణాలకు ఏప్రిల్ 1 నుంచి లైసెన్సు తేదీ అమల్లోకి రానుంది. జాతీయ రహదారికి 500 మీటర్ల పరిధిలో 3,150 దుకాణాలు ఉన్నట్లు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో 1,300 దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆయా దుకాణాల యజమానులు ముందుకు వచ్చారు. వీరికి లైసెన్సులు రెన్యువల్ చేస్తారు. జాతీయ రహదారికి 500 మీటర్ల బయట ఉన్న షాపులకు జూలై 1 నుంచి లైసెన్సు తేదీ అమల్లోకి వస్తుంది. రెండు సందర్భాల్లోనూ లైసెన్సు గడువు ముగిసే తేదీ మాత్రం 2019 జూన్ 30గా ప్రభుత్వం ప్రకటించింది. లైసెన్సు కోసం మండల పరిధిలో రూ.50 వేలు, నగర పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలో 75 వేల రూపాయలు, నగర పాలక సంస్థల పరిధిలో లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ చార్జిగా చెల్లించాల్సి ఉంటుంది. షాపుల ఏర్పాటు కోసం అందిన దరఖాస్తుదారుల పేర్లలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు. దుకాణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్ ఏర్పాటు, మరికొన్ని సవరణలో అబ్కారీ విధానాన్ని ప్రకటించారు.