రాష్ట్రీయం

నిరూపిస్తే...రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23:అగ్రిగోల్డ్ ఆస్తులపై గురువారం విపక్ష నేత జగన్‌కూ, మంత్రి ప్రత్తిపాటికీ మధ్య వాగ్వాదం జరిగింది. అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్య కొన్నారని జగన్ ఆరోపించగా, నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి సవాల్ చేశారు. తొలుత జగన్ మాట్లాడుతూ అగ్రిగోల్డు ఆస్తులను కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారని, అటాచ్ మెంట్ అయిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మకు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందన్నారు. అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఎకరాల భూమిని 2014లో మంత్రి భార్య కొనుగోలు చేశారని, హాయ్‌లాండ్‌ను స్వాధీన పరచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని గురువారం శాసనసభలో ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలతో దద్దరిల్లింది. అగ్రిగోల్డు చైర్మన్‌కు సమీప బంధువైన దినకర్, వెంకటాద్రి, సీతారాంల వద్ద నుంచి ఈ భూమిని మంత్రి తన భార్య వెంకాయమ్మ రిజిస్టర్ చేయించుకున్నారని దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటాద్రి ట్రేడకు చెందిన 4.03 ఎకరాలు, సీతారాం భార్య పుష్పలత పేరిట ఉన్న 3.78 ఎకరాలు, బ్రహ్మంగారి మఠంలో ఓ చిన్నారి పేరిట ఉన్న భూములు అమ్ముకున్నారని తెలిపారు. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపాలని పట్టుపట్టారు.
మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ అగ్రిగోల్డు కంపెనీ అటాచ్‌మెంట్ భూములు తాను కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాననీ, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని మంత్రి ప్రత్తిపాటి జగన్‌కు సవాల్ విసిరారు. గత సమావేశాల్లో ఇదే రకంగా చాలెంజ్ చేస్తే జగన్ సభ నుంచి పరారయ్యారని మంత్రి ఎద్దేవా చేశారు. తాను ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేశానని వివరించారు. ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలపై సభాసంఘాన్ని నియమించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

చిత్రాలు.. జగన్‌, ప్రత్తిపాటి