రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2017-18) నుండి ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 16,392 టీచర్ పోస్టుల త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందులో 7600 పోస్టులు గురుకులాల కోసం,మరో 8792 ప్రభుత్వ పాఠశాలల కోసం భర్తీ చేస్తామని అన్నారు. ఉర్దూ మీడియం టీచర్ల పోస్టులు 900 వరకూ ఉంటాయని తెలిపారు.వీటన్నింటి భర్తీ బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించామని చెప్పారు. గురుకులాలకు, ప్రభుత్వ పాఠశాలల రిక్రూట్‌మెంట్‌లు వేర్వేరుగా టిఎస్‌పిఎస్‌సి నిర్వహిస్తుందని తెలిపారు. అయితే వీటి ఎంపిక ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుందన్నారు. గురువారం శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చకు ఉప ముఖ్యమంత్రి బదులిస్తూ, 10వేల స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం అమలు చేస్తామని, 21 జిల్లాల్లో సెంట్రల్‌లైబ్రరీలు నెలకోల్పుతామని వెల్లడించారు. డైట్‌లలో ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ ఈ ఏడాది నుండి ప్రారంభిస్తామని చెప్పారు. ఉచితంగానే ఇంటర్ విద్య అందిస్తామని, యూనివర్శిటీలకు పూర్వ వైభవం తెస్తామని పేర్కొన్నారు. గత పాలకులు విద్యారంగాన్ని అనుత్పాదకంగా చూడటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. డూప్లికేషన్ లేకుండా విద్యార్ధులను 95 శాతం మేర ఆధార్‌తో లింక్ చేశామని, ప్రభుత్వ స్కూళ్లలో చేరికను పెంచేందుకు ఏప్రిల్ మొదటివారంలోనూ, జూన్ మొదటివారంలోనూ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది విద్యకు 12,705 కోట్లు కేటాయించామని, అన్ని స్కూళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నామని వెల్లడించారు. కెజిబివి స్కూళ్లను 12వ తరగతి వరకూ పొడిగించమని కేంద్రాన్ని కోరుతున్నామని, అనుమతి రాగానే అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. 5600 స్కూళ్లలో ఈ ఏడాది డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని, గత ఏడాది 3400 స్కూళ్లలో డిజిటల్ క్లాసులు మొదలయ్యాయని అన్నారు. ప్రతిపాఠశాల నిర్వహణకు గరిష్టంగా లక్ష రూపాయిల వరకూ ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రారంభ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని, ఉస్మానియా అభివృద్ధికి ప్రణాళిక విడుదల చేస్తామని అన్నారు. యూనివర్శిటీలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. గిరిజన వర్శిటీని వరంగల్ జిల్లాలో నెలకొల్పుతామని, అందుకు భూమి గుర్తించామని తెలిపారు.