రాష్ట్రీయం

ఇక ‘టి ప్రైమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉందని మిగిలిన రాష్ట్రాలు తెలంగాణను నమూనాగా తీసుకుంటున్నాయని పరిశ్రమలు, ఐటిసి మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. గురువారం వివిధ పద్దులపై శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ, ఇక రాష్ట్రంలో ‘టి ప్రైమ్’ పేరిట కొత్త పథకాన్ని అమలుచేస్తామని వెల్లడించారు. 400 ఎకరాల్లో దండుమల్కాపూర్‌లో గ్రీన్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తమ పరిశ్రమలకు అవార్డులు ఇస్తామని, వరంగల్‌లో టి హబ్, టాస్క్ సెంటర్లు నెలకోల్పుతామని, ఇంటింటికీ ఇంటర్‌నెట్ అందిస్తామని చెప్పారు. కొత్తగూడెంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ నెలకోల్పే చర్యలు చేపడతామని, రాష్ట్రంలో మూడు చోట్ల ఏరో స్పేస్ హబ్‌లు వస్తున్నాయని, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతుందని ఆయన వెల్లడించారు. సత్తుపల్లిలో ఫుడ్‌పార్కు, రంగారెడ్డిలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ ఉపకరణాల పార్కు, నిజామాబాద్ బాల్గొండలో ఫుడ్‌పార్కు నెలకోల్పుతామని, మానకొండూరులోని బెజ్జంకి లో గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల శాఖ పురోగతిని వివరించారు. టిఎస్ ఐపాస్ అమెరికాలో కూడా లేదని, చాలా రాష్ట్రాలు ఈ పథకానికి సానుకూలంగా స్పందించారని అన్నారు. అలాగే దళిత, గిరిజనుల కోసం టి ప్రైడ్ అమలుచేశామని, దాని కింద 7400 కొత్త యూనిట్లు నెలకోల్పగా 409.62 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు మాదిరి ముస్లింలకు టి ప్రైమ్ పథకం కొత్తగా అమలులోకి తెస్తున్నామని అన్నారు. దండుమల్కాపూర్‌లో 400 ఎకరాల్లో ఎస్‌ఎంఇ గ్రీన్ పార్కు నెలకోల్పుతున్నామని చెప్పారు. రిచ్ పేరిట మరో పథకాన్ని అమలుచేస్తున్నామని, జాతీయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించి వాటి ఫలితాలను క్షేత్ర స్థాయిలో అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం వంద కోట్ల మూలధనాన్ని కేటాయించామని తెలిపారు. ఖాయలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు ఈ నిధి తోడ్పడుతుందని అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్‌ను, సిమ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానూ, సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును, పునరుద్ధరిస్తున్నామని, వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు నెలకోల్పితే ప్రత్యేక రాయితీలు ఇచ్చే యోచన కూడా ప్రభుత్వానికి ఉందని అన్నారు. చేనేత ఔళి రంగాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 1200 కోట్లు కేటాయించామని, గీసుకొండ వద్ద మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.