రాష్ట్రీయం

ఎనె్నస్పీ 3వ జోన్‌కు 1000 క్యూసెక్కుల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 23: నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో మూడో జోన్‌లో ఉన్న ప్రాంతానికి 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసేందుకు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. సాగర్ ఎడమ కాలువ 3వ జోన్ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలకు నీరు విడుదల చేయాల్సి ఉంది. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య పలుదఫాలు చర్చలు జరిగినా ఫలితం కానరాలేదు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. కనీసం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరారు. రబీలో పంటలు ఎండిపోతున్నాయని, కొన్నిచోట్ల మంచినీటి సమస్య కూడా ఉత్పన్నమైందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ అధికారులు పాలేరు రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని 3వ జోన్‌కు విడుదల చేస్తామని అంగీకరించారు. ఈ నెల 25 నుండి ఈ నీరు ఆ ప్రాంతానికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.