రాష్ట్రీయం

సభలో ఎవరో ఒకరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: అసెంబ్లీలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రతిపక్ష నేత జగన్‌లలో ఎవరో ఒకరే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితుల అంశానికి సంబంధించి మంత్రి పుల్లారావు చేసిన సవాల్‌ను ఆయన ప్రస్తావించారు. సిఎం ప్రసంగానికి వైకాపా ఎమ్మెల్యేలు పదే పదే అడ్డు తగిలారు. సభ అంటే విపక్షానికి గౌరవం లేదని, మంత్రిపై ప్రతిపక్ష నేత జగన్ గురువారం పదే పదే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మంత్రి భార్య అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారన్న విపక్ష నేత ఆరోపణల్ని పుల్లారావు ఖండించారని, అయినా విపక్ష నేత జ్యుడీషియల్ విచారణకు పట్టుబట్టారని సిఎం గుర్తు చేశారు. ‘పుల్లారావుది తప్పు అయితే ఆయన్ని సభ నుంచి వెలివేద్దాం.. నిరూపించలేకపోతే జగన్‌ను వెలివేద్దాం’ అన్నారు. గుడ్డ కాల్చి ముఖాన పడేసి, తుడుచుకోవాలంటే సరికాదన్నారు. ఎందుకు భయపడతారు.. డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించారు. సభలో ఒక్కరే ఉండాలని స్పష్టం చేశారు. దీంతో మరోసారి వైకాపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి అలానే మాట్లాడతారని, ఆటవిక రాజ్యం నడిచేలా వైకాపా నేత వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశానికి ఒక సహేతుకమైన ముగింపు ఇవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోరగా, జగన్ కాగితాలు చూపించారు. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతిష్ఠకు పోవద్దని, ఆరోపణలు ఆవాస్తవాలైతే, సభలో లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జ్యుడీషియల్ విచారణను జగన్ అడిగారని, మంత్రి పుల్లారావు సవాల్‌ను స్వీకరించడం లేదని, ఆరోపణలు ఉపసంహరించుకోవాలన్నారు. ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని మంత్రిపై చేసిన ఆరోపణలను నిరూపించడమో లేదా ఉపసంహరించుకోవడమో చేయాలని జగన్‌కు హితవు చెప్పారు. అయినా వైకాపా సభ్యులు నినాదాలు ఆపకపోవడంతోమరోసారి సభను వాయిదా వేశారు.