రాష్ట్రీయం

రైతులు చెప్పేదీ వింటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల స్కీమ్‌కు సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రాజెక్ట్‌కోసం 95 ఎకరాలను సేకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఇ శ్రీదేవి, మరో 59మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను జస్టిస్ ఏవి శేషసాయి విచారించారు. పిటిషనర్ల తరఫున బి రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ సామాజిక, పర్యావరణ అధ్యయనాలు నిర్వహించకుండా, నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ చేపట్టిందన్నారు. ఈ గ్రామంలో భూములు సారవంతమైనవనీ, ఎకరం రూ.18 లక్షల ధర పలుకుతోందన్నారు. 60 రోజుల్లోగా రైతులు భూమిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారన్నారు. ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. చట్టంలోని నిబంధనలను అమలు చేస్తామన్నారు. అధికారులు నిర్వహించనున్న బహిరంగ విచారణలో గ్రామస్తులు తెలియచేసే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అడ్వకేట్ జనరల్ ఇచన హామీని హైకోర్టు నమోదు చేసింది.