రాష్ట్రీయం

ఇదేం దారుణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 24:రాష్టవ్య్రాప్తంగా అగ్రిగోల్డు బాధితుల అర్తనాదాలు అసెంబ్లీలో వినిపిద్దామని ప్రయత్నిస్తుంటే, సమస్యను పక్కదారి పట్టించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 లక్షల మంది బాధితుల సమస్యపై మాట్లాడేందుకు కనీసం 20 నిమిషాల సమయాన్ని సైతం కేటాయించక పోవడం దారుణమన్నారు. చర్చను పక్కదారి పట్టించే క్రమంలోనే గతంలో తాను చేసిన ఛాలెంజ్‌లను పక్కన పెట్టి కొత్త ఛాలెంజ్‌లకు తెర తీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రుణమాఫీ పచ్చి అబద్దమన్న ఆయన అగ్రిగోల్డు అస్తులు, రుణమాఫీ జరిగిన తీరును ఆధారాలతో ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ సమస్య మంత్రి పుల్లారావుకు తనకు మధ్య వ్యక్తిగత సమస్య కాదన్నారు. తాను చూపుతున్న ఆధారాలు బాధితులు తనకు ఇచ్చినవేన్నారు. అగ్రిగోల్డు సంస్థకు సంబంధించిన దినకర్ అనే వ్యక్తి దగ్గరే పుల్లారావు ఆయన భార్యపేరుపై కొనుగోలు చేశారని చెబుతూ, ఇందుకు సంబంధించిన పాస్ బుక్, సేల్ డిడ్‌లను చూపించారు. ఇదే క్రమంలోనే ‘సభలో నేనైనా ఉండాలి, పుల్లారావు అయినా ఉండాలి’ అని ఛాలెంజ్ చేస్తున్న చంద్రబాబు గతంలో నేను ఓటుకు నోటు, ఎమ్మెల్యేలతో రాజీనామాకు సంబంధించిన ఛాలెంజ్‌లు ఎమయ్యాయని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఆ గొంతు చంద్రబాబుది కాదని నిరూపించగలరా అని మరో ఛాలెంజ్ విసిరారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి హాయ్‌ల్యాండ్, యారాడ, అతిహోయ, వంటి ఆస్తులను ఎందుకు వేలం వేయడం లేదని ప్రశ్నించారు. తాను చూపిస్తున్న ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంత్రి పుల్లారావు చెప్పిన రుణమాఫీ వివరాలు పచ్చి అబద్ధమని చెప్పిన జగన్, విశాఖపట్నానికి చెందిన ధర్మశ్రీ కుటుంబానికి చెందిన రుణమాఫీ డాక్యుమెంట్లను చూపించారు. రుణమాఫీ గోరంత అయితే వారి అప్పు కొండంత ఉందన్నారు. బాబు సిఎం అయ్యే నాటికి 87వేల కోట్ల రుణాలు ఉన్నాయని, అందుకోసం రైతులు ప్రతి ఏడాది 16వేల కోట్లు చెల్లిస్తుంటే ప్రభుత్వం వారికి ఇస్తున్నది కేవలం 3500 కోట్లేనన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న రుణమాఫీ అబద్ధాలు అని ఆరోపించిన ఆయన సాక్ష్యాలు ఇవిగో అని ప్రదర్శించారు. సభలో ఉన్నది మనుషులు కారని, రాక్షసులని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆధారాలతో మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.