రాష్ట్రీయం

కోడిగుడ్డుకు ఈకలు పీకకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ హయాంలో ఎసిసి, ఎస్‌టి ఉప ప్రణాళిక చట్టానికంటే తాము ప్రతిపాదించిన బిల్లు మెరుగైందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రాల బడ్జెట్ నిర్మాణాన్ని మార్చుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉప ప్రణాళిక స్థానంలో ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధికి చట్టబద్ధత కల్పించడానికి బిల్లు ప్రతిపాదించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. శాసనసభలో శుక్రవారం సాయంత్రం సంక్షేమ పద్దులపై చర్చ ముగిసిన అనంతరం ఎస్‌సి అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక నిధి బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ 2013లో తమ ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి పేరు మార్చడం తప్ప దీంట్లో కొత్తదనం ఏమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాన్ని కనబడకుండా చేయాలన్న రాజకీయ కుట్రతోనే ఎస్‌సి, ఎస్‌సి ప్రత్యేక నిధి బిల్లు ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ హయాంలో చేసిన చట్టాని కంటే తాము తీసుకొచ్చే చట్టం మరింత మెరుగైందిగా తీర్చిదిద్దామన్నారు. ఈ బిల్లు రూపొందించడానికి ముందే ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాల మేరకే బిల్లు తయారు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన చట్టంలో దేనిని తొలగించకుండానే మరింత ప్రయోజనకారిగా ఉండేలా బిల్లు తయారు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన చట్టానికి తమ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వారి కంటే మరింత మెరుగుగా తాము తీసుకొస్తున్న చట్టానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి కోడిగుడ్డుపై ఈకలు పీకడం మంచిది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. మంచిపనికి మద్దతు ఇవ్వడం హుందగా ఉంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికకు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదన్న కాంగ్రెస్ విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేసిన దాని కంటే ఎక్కువనే ఖర్చు చేశామని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరించారు.
దళితులకు భూ పంపిణీ నిరంతర ప్రక్రియ
దళితులకు భూ పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది పది వేల ఎకరాలు పంపిణీ కోసం భూములు కొనుగోలు చేశామన్నారు. దళితులకు ఉచితంగా భూ పంపిణీ చేయాలని తమను ఎవరు కోరలేదన్నారు. గతంలో దళితులు, గిరిజనులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూముల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగలేదన్నారు. అలా కాకుండా తాము ఇచ్చే భూమి దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఉండాలన్న సదుద్దేశంతో అమలు చేస్తున్నామన్నారు. అయితే దళితులకు భూ పంపిణీ రాత్రికి రాత్రి పూర్తి కాలేదన్నట్టుగా విమర్శించడం సరికాదన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. దళితులు అందరికీ ఉచితంగా భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన దళితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఎకరం భూమి కలిగి ఉంటే రెండు ఎకరాలు, రెండు ఎకరాలు కలిగి ఉంటే ఎకరం, అసలు లేకపోతే మూడు ఎకరాలు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశమన్నారు.