రాష్ట్రీయం

దరిద్రపు బ్రాహ్మణ సంస్కృతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: ‘దరిద్రపు బ్రాహ్మణిక సంస్కృతి వచ్చి గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలు పెద్దమాంసం తినలేని పరిస్థితి..ఈ మధ్య కాలంలో గ్రామాల్లో ఏవేవో పిచ్చి మాలలు వేసుకోవటం కూడా పెరిగింది. వీటి వల్ల మాంసం తినలేకపోతున్నామనే మాటలు వినిపిస్తున్నాయంటూ’ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘ఇదంతా ఏమిటో గాడిదగుడ్డు.. అంతా వేస్ట్.. పక్కనే అడవి ఉంది. అక్కడ అడవి పందులు ఉన్నాయి.శుభ్రంగా పట్టుకుని తినండి’అని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వివిధ జిల్లాల్లో తాను పనిచేసిన సందర్భంలో గ్రామాల్లో రాత్రినిద్ర చేసిన సందర్భంగా అక్కడి వృద్ధులు తమకు పెద్దకూర తినాలని ఉందని, కానీ గ్రామస్తులు తిననీయటం లేదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. పెద్దకూర తిన్నపుడు ఆరోగ్యంగా ఉన్నామని, అది తినటం మానివేసిన నాటినుంచి ఆరోగ్యం సహకరించటం లేదని కూడా వారు పేర్కొన్నట్టు తెలిపారు. అదే విధంగా మాలలు వేసుకున్న కారణంగా ఆరోగ్యం సహకరించటం లేదని కొందరు చెబుతున్నారనీ అన్నారు. మాంసం ఖరీదైన ఆహారం కాబట్టి అది కొనలేనివారు పక్కనే అడవిలో ఉన్న అడవి పందులను పట్టుకుని తినాలని సూచించారు. అవకాశం వస్తే తానూ వచ్చితింటానని తెలిపారు.్భరతప్రభుత్వం ఇటీవలే అడవి పందులను పట్టుకోవటం, తినటంపై నిషేదాన్ని ఎత్తివేసిందని కూడా ఆయన గ్రామస్తులకు గుర్తు చేశారు!