తెలంగాణ

బెంగాల్‌లో జిహాదీ కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: పశ్చిమబెంగాల్‌లో నిరంతరం పెరుగుతున్న జిహాదీ హింస, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతి వ్యతిరేక శక్తులకు రాష్ట్రప్రభుత్వమే ప్రోత్సాహం ఇవ్వడం, రాష్ట్రంలో హిందూ జనాభా తగ్గిపోవడం పట్ల అఖిల భారత ప్రతినిధి సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్, సంఘ్ చాలక్ పి వెంకటేశ్వరరావు చెప్పారు. బెంగాల్‌లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా హిందూ సమాజంపై పెద్ద ఎత్తున దాడులు పెరిగాయని వారు అన్నారు. కేరళలో సైతం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, అమానుష దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యం నెలకొనాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్ పెద్ద ఎత్తున విస్తరించినట్టు చెప్పారు. తెలంగాణలో 1495 స్థలాల్లో 2302 శాఖలు, 370 సాప్తాహిక్ మిలన్‌లు జరుగుతున్నాయని తెలిపారు. నేషనల్ కౌన్సిల్ సమావేశాలు కోయంబత్తూర్‌లోని అమృత విద్యాపీఠంలో జరిగాయని వారు చెప్పారు.
ఇందులో దేశవ్యాప్తంగా 1396 మంది ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంఘ్ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతున్నారని, సామాజిక సమరసత ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. హిందువులందరికీ దేవాలయ ప్రవేశం, ఒకే స్మశానం, ఒకే చోట నీరుపట్టుకునే వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణ కార్యకర్తలు 10 జిల్లాల్లో విస్తృత సర్వే చేపట్టారని, 527 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి వివరాలు నమోదుచేశారని, ఇప్పటికీ వివక్ష ఉన్న గ్రామాల్లో సమస్యను పరిష్కరించే దిశగా గ్రామ పెద్దలతో మాట్లాడారని తెలిపారు. కొన్ని గ్రామాల్లో కొందరు సామూహిక స్మశానవాటిక కోసం తమ భూములను కూడా ఇవ్వడం విశేషమన్నారు. దేశంలో పరిస్థితులపై చర్చకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నామని, సామాజిక రక్షాబంధన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామని అన్నారు.