మెయన్ ఫీచర్

కాషాయ సిఎంపై కారాలు, మిరియాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడిమిడి మీడియాకు ఇప్పుడు చేతినిండా పనే.. తాజా కథనాలను విషంతో రంగరించి వండి వార్చేందుకు మీడియాలో తెగ హడావుడి.. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం చేసినా, ఏం చెప్పినా ఆ విషయాలను బహిర్గతం చేయాల్సిందే, ఖండించాల్సిందే.. ఇది మీడియా మేధావుల సూత్రీకరణ. ఎందుకంటే ‘కాషాయ ముఖ్యమంత్రి’ ఏం చేసినా అందులో నియంతృత్వం, లౌకికవాద వ్యతిరేకత తప్ప ఇంకొకటి ఉండదని ‘మీడియా ఘనుల’ బలమైన వి శ్వాసం. సిఎం పీఠాన్ని యోగి అధిష్ఠించాక యుపిలో సెక్యులరిజానికి గడ్డుకాలమేనన్న బెంగతో ‘ఉదారవాదులు’ అప్పుడే గగ్గోలు పెడుతున్నారు. ‘హిందూ మతోన్మాది’, ముస్లింల పాలిట ‘కసాయి హంతకుడు’ అయిన ఆదిత్యనాథ్ పాలనాపగ్గాలు చేపట్టడంతో- ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు టైమ్‌బాంబు మీద కూర్చున్నట్టు ఉందని, లౌకిక వాదం మరణశయ్యపైకి చేరిందన్న విష ప్రచారం అప్పుడే మొదలైంది. నిజమే.. మరణశయ్యపైకి చేరుకున్నది ‘కుహనా లౌకిక వాదం’ మాత్రమే. ఈ ‘కుహనా లౌకికవాదా’న్ని ప్రచారం చేస్తోంది ‘హిందుత్వ భయం’ పట్టుకున్న ఉదారవాదులే. నిర్మలమైన గంగ, యమున నదీ జలాల నుంచి కుహనా లౌకికవాదం ఉద్భవించదు. ఇప్పుడో ఆహ్లాదకర పరిణామం ఏమంటే- లౌకిక వాదానికి సరికొత్త నిర్వచనం చెప్పాలన్న గళాలు కొత్తగా వినిపిస్తున్నాయి. యుపిలో ఎంతో ఆశావహ దృక్పథంతో ప్రజలు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇదో కొత్త పరిణామం.
మంచి మార్పులొస్తున్నా అవి కనిపించనీయకుండా ‘పచ్చకామెర్ల’ ఉదారవాదులు చేస్తున్న గందరగోళం ఇంతా అంతా కాదు. ఏ చిన్న వార్త వచ్చినా ముఖ్యమంత్రిని అప్రతిష్ఠ పాలు చేయడమే వారి ఏకైక అజెండా. లక్నోలోని ఓ ప్రఖ్యాత కబాబ్ దుకాణాన్ని అధికారులు మూసివేయించడంతో ఎద్దు మాంసం తినేవారి హక్కుల్ని హరించి వేశారంటూ ఈ ‘ఉదారవాదులు’ నానా రభస చేశారు. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు సామాజిక మీడియాలోనూ గొంతు చించుకున్నారు. లక్నో చరిత్రకు, అక్కడి జనం ఆనందానికి కారణమైన ‘తుండే కబాబ్’ దు కాణాన్ని మూసివేయడం అన్యాయం అంటూ కొందరు ‘ట్వీట్ల’ను సంధించారు. ‘కళ్లకు గంతలు కట్టుకున్న’ ఇలాంటి వారికి- భారతీయ నాగరిక చరిత్రలో అయోధ్య ఓ భాగం కాదని అనిపిస్తుందేమో!
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయు)కి ‘రెచ్చగొట్టే’ పనిమీద వెళ్లిన ఓ టీవీ జర్నలిస్టుకు అక్కడి విద్యార్థులు చెప్పిన విషయాలు వి న్నాక నిజంగా మతిపోయినంత పనైంది. యోగి పాలనపై ఆ విద్యార్థులు ఎంతో ఆ శాజనకంగా మాట్లాడడంతో- ఆ మహిళా జర్నలిస్టు ‘మీరు ఎంతో ఆశావాదంతో ఉం డొచ్చు.. కానీ, ‘గోరఖ్‌పూర్ మహంత్’ (ఆదిత్యనాథ్) ముస్లింలను బెదిరించిన సంఘటనల్ని మీరు మరిచిపోగలరా?’ అని ప్రశ్నించింది.
ఇప్పుడు రెండు అభిప్రాయాలకు తావులేదు. హిందూ వ్యతిరేకతతో దండయాత్ర చేసేవారికి, ముఖ్యంగా ఢిల్లీలోని మీడియాకు యోగి ‘ఎరుపు వస్త్రం’గానే గోచరిస్తాడు. ఎన్నికల్లో పరాజితులైన నేతలు, ‘పవిత్ర సెక్యులర్ వ్రతదీక్ష’లోని వారి అనుయాయులు టీవీ స్టూడియోల్లో తీరిగ్గా కాలక్షేపం చేస్తూ- గతంలో యోగి చేసిన ‘పాపాల’పై సుదీర్ఘ చర్చల్లో పాల్గొంటారు. తమ కోరల్లో దాచి ఉన్న విషాన్నంతా చిమ్ముతుంటారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తెచ్చిపెట్టిన కష్టనష్టాలపైనా వారు గగ్గోలు పెడుతుంటారు. పంజాబ్‌లో ప్రజాభీష్టంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ వారు సైతం ఈ చర్చల్లో నిరసన ప్రకటించడం విడ్డూరం. ఈ వ్యవహారం విపక్ష పార్టీల దివాలాకోరుతనాన్ని తేటతెల్లం చేస్తోంది. పాత భావజాలాన్ని వదులుకోలేక, కొత్త ఆలోచనలు రాక వీరు బయటపడలేక పోతున్నారు. యుపి ఎన్నికల ఫలితాలు విపక్షాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. విపక్ష నేతలకు కొత్త ఆలోచనలు లేవు, కార్యసాధక అజెండా అసలు లేనే లేదు. భవిష్యత్‌పై ఎలాంటి దృష్టీ లేదు. ప్రధాని మోదీ, సిఎం యోగి ఏది చేసినా వీరి ‘అంధ వ్యతిరేకత’కు ఇవే కారణాలు.
సమాజంలోని అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని ఆదిత్యనాథ్ లోక్‌సభలో వీడ్కోలు ప్రసంగంలో చెప్పినా ఆయన మాటలు విపక్షాలను ఒప్పించలేక పోయాయి. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రీ చవిచూడని రీతిలో ప్రజామోదం పొందడంతో విపక్షాలు యోగిపై సహజంగానే తీవ్ర వ్యతిరేక భావంతోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించలేదు.. ఎందుకని..? యోగిని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే యుపి ప్రజలు భాజపాకు ఓట్లు వేసేవారు కాదన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్నాయి. అ యితే, మోదీని చూసి ఓటర్లు తీర్పు చెప్పారన్న వాస్తవాన్ని విపక్ష నేతలు గ్రహించాలి.
‘లౌకిక పండితుల’మని గొప్పలు చెప్పుకునే కొందరైతే మరో వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఓ వౌల్వీ, ఓ బిషప్, ఓ గురుద్వారా సంత్ ముఖ్యమంత్రి కాగలరని ఊహించగలమా? ఓ మఠాధిపతి సిఎం అయ్యేందుకు ఎలా అనుమతించారు?’ అని వీరు ప్రశ్నిస్తున్నారు. అ యితే, 22 ఏళ్ల వయసులోనే ఆదిత్యనాథ్ లోక్‌సభకు ఎన్నికైన విషయాన్ని వీరు విస్మరించినట్టున్నారు. ఈ ‘ఉదారవాద ఘనాపాఠీల’ ఆలోచనా ధోరణి ఏమిటన్నది ఎంతకీ అంతుబట్టదు.
భాజపా తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించాకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించిన సంగతి ‘ఉదారవాదుల’కు గుర్తుకు లేదేమో? ఈ కోణంలో చూస్తే యోగి ఎందుకు మినహాయింపు కాదు? భారత రాజ్యాంగానికి లోబడే యోగి దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యుపిలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కృషిచేస్తానని ప్రకటిస్తున్నారు. అత్యంత లౌకికవాదాన్ని చూపినా, జనం కోసం పనిచేసినా మీడియా మేధావులు యోగిని ప్రశంసిస్తారా? మంచి పరిపాలకుడిగా అంగీకరిస్తారా? అన్నది అనుమానమే.
ఓ కార్టూనిస్టు యోగిని హిట్లర్‌తో పోల్చాడు. హిట్లర్‌కు ఓ అవకాశం ఇచ్చినట్లు యోగికి కూడా ఓ అవకాశం ఇవ్వవచ్చన్న వ్యాఖ్య ఆ కార్టూన్‌లో ఇమిడి ఉంది. ఇంతకంటే విషం చిమ్ముతూ గతంలో మోదీని హిట్లర్‌తో, ముస్సోలినితో పోల్చారు. ఉదారవాద మీడియా, ‘అంతరించిపోతున్న కమ్యూనిస్టులు’ కూడా మోదీపై చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అందరి దృష్టీ యోగిపై పడడంతో ప్రస్తుతం మోదీకి కాస్త విశ్రాంతి లభిస్తుందనే చెప్పాలి! యోగి ప్రసంగాలు ‘మంటలు పుట్టిస్తున్నాయంటూ’ దాడి చేస్తున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇంతకూ చేస్తున్నదేమిటో? తన తండ్రి కాలం నుంచి మతోన్మాద ప్రచారాన్ని నమ్ముకున్న సంగతిని ఆయన విస్మరించారా?
యుపిలో మహిళల్ని వేధించే ‘రోమియో’ల భరతం పట్టాలని ముఖ్యమంత్రి యోగి పోలీసులను ఆదేశించడాన్ని కూడా మీడియా వివాదాస్పదం చేస్తోంది. దిల్లీలోని టీవీ చానళ్లలో దీనిపై ఎడతెగని చర్చలకు తెరలేచింది. రోమియోల ఆగడాలను అరికడితే కొందరు ఉదారవాదులు, మీడియా ప్రముఖులు ‘మోరల్ పోలీసింగ్’ అంటూ తప్పుపడుతున్నారు. తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘షీ’ టీమ్‌ల పనితీరు బాగుందని అంతా సంతృప్తి చెందుతున్నారు. మహిళలను వేధించేవారిని ‘రోమియోలు’ అనడంపై కూడా కొందరు అభ్యంతరం చెప్పడం విడ్డూరం. దారితప్పి తిరిగే యువకులను ‘రోడ్‌సైడ్ రోమియో’లు అనడం పరిపాటి. ‘రోమియో, జూలియట్’ పాత్రలను సృష్టించిన ప్రఖ్యాత రచయిత షేక్స్‌పియర్‌కు ఇది అవమానం కాదు కూడా. మనకు రాధాకృష్ణుల్లా ప్రపంచానికి రోమియో, జూలియట్‌లు గొప్ప ప్రేమికులట! అందుకే- ఆదిత్యనాథ్ ఈ పని చేయడం వారికి దైవదూషణగా కనిపిస్తోంది. కుహనా లౌకికవాదుల ఈ తరహా మనస్తత్వమే యుపి ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది. ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిందే.
యోగి అవినీతిపరుడు కాదన్నది అందరూ ఒప్పుకునేదే. అయితే, సిఎం కావడానికి అవినీతి లేకపోవడం ఒక్కటే అర్హత కాదు. గతంలో యుపిలో ఎంతోమంది నేతలు అనేక అవినీతి ఆరోపణలున్నా సిఎం పీఠం పొందారు. అవినీతి, న్యాయ ధిక్కరణ, పాలనలో వైఫల్యం.. ఇలాంటి అవలక్షణాలు ఎన్నున్నా ఫరావాలేదు.. కానీ, ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ అని గొంతెత్తి ఘోషించేవాడు మాత్రం ముఖ్యమంత్రి కారాదు.. ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలాన్ని భరించలేకే యుపి ప్రజలు ముక్తకంఠంతో అరుదైన తీర్పు ఇచ్చారు.
*