రాష్ట్రీయం

పార్టీ పరువు తీస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం జరిగిన దౌర్జన్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనతో ప్రమేయం ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖాధికారులతో ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యవహరించిన తీరుపై ఆయన సమాచారం తెప్పించుకున్నారు. అనంతరం ఆదివారం వారిని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు.
అక్కడ ఏమి జరిగిందనేది అనవసరమని, చేసింది తప్పని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏమైనా ఇబ్బందులుంటే అధికారి కార్యాలయానికి వెళ్లి మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే పార్టీ పరువు పోతుందంటూ మందలించారు. ఈ ఘటనకు సంబంధించి ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యానికి క్షమాపణ చెప్పాలని సంబంధిత పార్టీ నేతల్ని ఆదేశించారు.
బాలసుబ్రమణ్యం మంచి పేరున్న అధికారి అని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేశినేని అనుచరుడు పట్ట్భాపై కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు. అనంతరం ఎంపి కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ వెంకన్న కమిషనర్ కార్యాలయానికి వెళ్లి శనివారం జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పడంతో వివాదానికి తెరపడింది.

చిత్రం..రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను కలిసి క్షమాపణ చెబుతున్న ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమ