రాష్ట్రీయం

పార్టీలోనూ కెటిఆర్‌కు అందలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26:తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు తన వారసుడిగా తనయుణ్ని నిలబెట్టే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చాక జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికల సమయంలో కెటిఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఉద్యమంలోనూ, టిఆర్‌ఎస్ పార్టీలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీ వచ్చిందంటే అందుకు కెటిఆర్ వ్యూహ చతురతే కారణం. ఈ విజయంతో కెసిఆర్ వారసుడిగా తొలి పరీక్షలో కెటిఆర్ గట్టెక్కారంటూ రాజకీయ పరిశీలకులు విశే్లషించిన విషయం గమనార్హం. ఉద్యమ కాలంలోనూ, 2014 ఎన్నికల్లోనూ కంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ బలం మరింత పెరిగింది. అటు పార్టీపైనా, ఇటు ప్రభుత్వంపైనా పూర్తి పట్టు సాధించిన ప్రస్తుత తరుణంలోనే తనయుడికి పార్టీలోనూ కీలక బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్‌ను నియమించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అప్పట్లో మాజీ ఎంపి నరేంద్ర తన పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసిన సందర్భంగా తొలిసారిగా ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడే తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు. కాంగ్రెస్, టిడిపిలకు అధ్యక్షులతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. టిఆర్‌ఎస్‌లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును తిరిగి ఏర్పాటు చేసి ఆ పదవిలో కెటిఆర్‌ను నియమిస్తే పార్టీపై కూడా పట్టు సాధించే అవకాశం ఉందన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. తొలుత ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉన్న కెటిఆర్ తరువాత ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖలను చేపట్టి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి తరువాత ప్రభుత్వంలో పవర్ సెంటర్‌గా ఎదిగారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాలపై కెసిఆర్ పెద్దగా దృష్టిసారించలేదు. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఇకపై పార్టీపై కూడా దృష్టిసారించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఏప్రిల్‌లో ఏర్పాటు చేసే కార్యవర్గం పూర్తిగా ఎన్నికల కార్యవర్గం అవుతుంది.
ఇప్పటివరకు నిర్వహించిన ప్లీనరీకి భిన్నంగా ఈసారి టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌లోనూ, జిల్లాల్లోనూ పార్టీ ప్లీనరీ నిర్వహించినా ఒకేరోజు ప్లీనరీ, సభ జరిగేవి. ఈసారి అందుకు భిన్నంగా ప్లీనరీ ఒక చోట, బహిరంగ సభ మరో చోట నిర్వహిస్తున్నారు. సాధారణంగా 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్లీనరీ జరుగుతుంది. కానీ ఈసారి ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ అనంతరం ఆరు రోజుల తరువాత 27న వరంగల్‌లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించడం విశేషం.