రాష్ట్రీయం

వెండితెర వెనె్నల మహానటి సావిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 26: తెలుగునాట, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి అద్భుతమైన నటనాభినయాన్ని సొంతం చేసుకుని, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకు, అంతకుమించి వెండితెరకు వెనె్నల వెలుగులద్దిన మహానటి సావిత్రి నటరాణి అని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు నివాళి అర్పించారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు నగరంలోని నాజ్ సెంటర్ ఐలాండ్‌లో కళాదర్బార్ అమరావతి సంస్థ ఆధ్వర్యాన మహానటి సావిత్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. సుమారు ఆరు లక్షల రూపాయల వ్యయంతో సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి స్వయంగా తయారుచేయించిన కాంస్య విగ్రహాన్ని కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ, ఎపి కనీస వేతనాల బోర్డు చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్, శాసనసభ్యులు మహ్మద్ ముస్త్ఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, బహుభాషా నటీమణి సుహాసినితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా కోడెల మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డైన గుంటూరు నగరంలో సావిత్రి కాంస్య విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ది ఏర్పాటు చేయడం, తన చేతులమీదుగా ఆవిష్కరించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. నటజీవిత కాలంలో, తదనంతరం కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నింపుకున్న సావిత్రి మహానటి అని, మహావ్యక్తి కూడా అని శివప్రసాద్ అంజలి ఘటించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం విడివడక ముందు హైదరాబాద్‌లోనే కార్యక్రమాలు జరిగేవని, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గుంటూరు, విజయవాడలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగడం శుభదాయకమన్నారు. కళాదర్బార్ సంస్థ 39 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సావిత్రి విగ్రహావిష్కరణ చేయటం ముదావహమని అతిథులు అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, నటీమణి సుహాసిని, తదితరులు ఈసందర్భంగా విజయచాముండేశ్వరి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. కళాదర్బార్ సంస్థ నిర్వాహకుడు పొత్తూరి రంగారావు, ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఆవిష్కరణ సభలో కార్యక్రమ నిర్వాహకుడు బి మోహనరావు, సావిత్రి జీవిత చరిత్ర రచయిత గార్లపాటి పల్లవి, విగ్రహ శిల్పులు బి ప్రసాద్, కె ప్రసాద్ పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరు నాజ్ సెంటర్ ఐలాండ్‌లో సావిత్రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్ కోడెల, బుద్ధప్రసాద్, విజయచాముండేశ్వరి, నటి సుహాసిని