రాష్ట్రీయం

‘గేట్’ టాపర్ సాయిప్రమోద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ఐఐటిలు, ఇతర జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో పిజి కోర్సులోనూ, పిహెచ్‌డిలోనూ ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో తెలుగు విద్యార్ధులు హవా చూపించారు. ఈ పరీక్ష గత ఫిబ్రవరి 4,5, 11, 12 తేదీల్లో జరిగింది. మొత్తం 23 సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుంది. జాతీయ స్థాయిలో 23 సబ్జెక్టుల్లో 23 మంది టాపర్లు నిలిచారు. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో రాష్ట్రం నుండి టాపర్లు వచ్చారు. టాప్ 10 ర్యాంకుల్లో 23 సబ్జెక్టుల్లో కలిపి 230 అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. అందులో కంప్యూటర్స్ సబ్జెక్టు నుండి మీర్‌పేట నివాసి సాయి ప్రమోద్ అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. అలాగే తార్నాకకు చెందిన శ్రీకళ్యాణి రెండో ర్యాంకు సాధించింది. ఆనంద్ 9వ ర్యాంకులో నిలిచాడు. వివిధ సబ్జెక్టుల్లో తొలి 10 ర్యాంకుల్లో నలుగురు హైదరాబాద్ వారే కావడం విశేషం. ఈ ప్రవేశపరీక్షలో సాధించిన ర్యాంకు మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించిన వారు క్యాబినెట్ సెక్రటేరియట్‌లోనూ, జాతీయ , పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఉద్యోగాల్లోనూ అవకాశం దక్కుతుంది. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు వీరికి స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి.కెమికల్ ఇంజనీరింగ్‌లో హర్ష గుప్త టాపర్‌గా నిలిచాడు.
కొంత మంది టాపర్లు
సబ్జెక్టు ర్యాంకు పేరు
మెకానికల్ 1 సుధీర్ కుమార్
మెకానికల్ 8 దివ్యాంశు జా
మెకానికల్ 16 ఆశిష్ అగర్వాల్
పిఇ 2 సోను గాంధీ
బిటి 5 తన్మన మిత్ర
బిటి 16 నాబోటియా సిన్హా
ఎంటి 1 నితీష్ రాయ్
సిఎస్ 16 కమల్ రాథోడ్
సిఎస్ 21 మోనిష్ కేశ్వాని
సిఎస్ 91 కెవి అభిషేక్
సిహెచ్ 2 యతేంద్రకుమార్
సిహెచ్ 15 వైభవ్ సింగ్
సిహెచ్ 27 ఇమ్రాన్ ఖాన్
సిహెచ్ 45 ఫైజల్ అజిజ్