రాష్ట్రీయం

పది బిల్లులకు ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 27: రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసేందుకు అబ్కారీ చట్టంలో సవరణలు తీసుకొస్తూ రూపొందించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సభలో మొత్తం 10 బిల్లులు ఆమోదం పొందాయి. ఓ వైపు వైసిపి ఎమ్మెల్యేల ఆందోళన..మరోవైపు వివరణలతో బిల్లుల్ని ఆమోదించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు కాంపౌండ్ ఫీజు, లైసెన్స్‌ల రెన్యువల్, శ్లాబ్ విధానంలో మార్పులు తీసుకొస్తూ రెండు సవరణ బిల్లులను ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. భూముల రిజిస్ట్రేషన్ల చట్టంలో తీసుకొచ్చిన సవరణల బిల్లును ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సభ ముందుంచారు. రాష్ట్రంలో నకిలీ రిజిస్ట్రేషన్లు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఒకటికి మించి డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్‌పెడుతూ చట్టసవరణతో బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా ఇటీవల ప్రవేశపెట్టిన రెండు బిల్లులు మారిటైమ్ బోర్డు, ఏపి
లాజిస్టిక్ విశ్వవిద్యాలయాల బిల్లును కూడా మరోసారి ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. కాగా విలువ ఆధారిత పన్నులకు సంబంధించి రెండు సవరణ బిల్లులు, వౌలిక సదుపాయాల అభివృద్ధి విస్తరణ చట్టాన్ని సవరిస్తూ మరో బిల్లును మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక వైభవాల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకొస్తూ ఏపి టూరిజం హెరిటేజి అండ్ కల్చరల్ బోర్డు బిల్లును మంత్రి అచ్చన్నాయుడు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్య ఎన్జీరంగా వర్శిటీ, వైఎస్సార్ హార్టికల్చర్ వర్శిటీ బిల్లులను మంత్రి పుల్లారావు ప్రవేశపెట్టారు. వీటితో సహా మొత్తం పది బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.