రాష్ట్రీయం

వారంలో అసెంబ్లీ ప్రత్యేక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: మైనారిటీల రిజర్వేషన్ల బిల్లుకోసం వారం రోజుల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ, బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల బిల్లు పెడతామని చెప్పాం. మాట నిలబెట్టుకుంటాం అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం లేదని, ముస్లింలలో వెనుకబడిన వారికి ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, వాటిని పెంచనున్నట్టు చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం కావాలనే సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం పరిస్థితి ఒక్కో విధంగా ఉంటుందని, జార్ఖండ్‌లో 69శాతం మంది గిరిజనులేనన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తెలంగాణలో 90శాతం మంది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఉన్నారు, పేదరికంలో ఉన్నవారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు తరహాలోనే తెలంగాణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘రిజర్వేషన్ల అంశంపై కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. కానీ మేం ఎన్నికల ప్రణాళికలో లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాం’ అని గుర్తుచేశారు. 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చామని, హామీపై ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘కేంద్రాన్ని కలుద్దాం. అదేవిధంగా సుప్రీంకోర్టును సైతం కలిసి మన వాదన బలంగా వినిపిద్దాం’ అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్లు ఒక శాతం పెంచాల్సి ఉందని, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై సభ్యులు అడిగారని, అందరితో చర్చించి ఈ అంశంపైనా నిర్ణయం తీసుకుందామని కెసిఆర్ అన్నారు. అసెంబ్లీ వారం రోజుల్లో మరోసారి ప్రత్యేకంగా సమావేశం అవుతుందని, విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని కెసిఆర్ అన్నారు.