రాష్ట్రీయం

ఈ ఏడాది నుంచే కొత్త మెస్ చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ మెస్ చార్జీల పెంపుపై చేసిన సిఫార్స్‌ను ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం 18 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే ప్రి మెట్రిక్ విభాగంలో 3 నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.750ని రూ.950కి పెంచారు. 8నుంచి టెన్త్ వరకూ విద్యార్థులకు చెల్లిస్తున్న రూ.850ని రూ. 1,100లకు పెంచారు. పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1,050ని రూ.1,400కు పెంచారు. కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లకు సంబంధించి ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.962ను రూ.1500కు పెంచారు. పిజీ విద్యార్థులకు రూ.682 నుంచి రూ.1500కు పెంచారు. డిగ్రీ విద్యార్థులకు రూ.520 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.520 నుంచి రూ. 750కి పెంచారు. స్టూడెంట్స్ మేనేజడ్ హాస్టళ్లు, డే స్కాలర్స్ విషయంలో ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ.442 నుంచి రూ.650కి, పిజీ కోర్సుల విద్యార్థులకు రూ.442 నుంచి రూ.650కి, డిగ్రీ విద్యార్థులకు రూ.325 నుంచి రూ.500కి పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పెంపుదల అమల్లోకి వస్తుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు.