రాష్ట్రీయం

అంతా.. అపసవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్‌కు, చేసిన ఖర్చుకు పొంతన లేదని భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) వేలెత్తిచూపింది. 2016 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ వ్యయాలను పరిశీలించిన కాగ్, తన నివేదికను సోమవారం శాసనసభకు సమర్పించింది. గడచిన ఏడాదికి ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ ప్రకారం 1,39,360 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, 1,04,098 కోట్లు మాత్రమే వ్యయం చేశారని పేర్కొంది. అంటే 35,262 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని నివేదికలో పొందుపర్చింది. ఈ మిగులులో 16,269 కోట్లను 2016 మార్చి 31కి నరెండర్ చేశారని, రెవెన్యూ మిగులు 238 కోట్లు చూపించారని పేర్కొంది. మొత్తం బాకీలు జిఎస్‌డిపిలో 21.37 శాతం ఉన్నాయని, నిబంధనలకు లోబడే బాకీలున్నాయని పొందుపర్చింది. వివిధ రూపాల్లో తీసుకొచ్చిన బాకీల్లో 53 శాతానికి పైగా బాకీలను వచ్చే ఏడేళ్లలోగా తీర్చాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం చేసిన అనేక విధాన నిర్ణయాలు అమల్లోకి రాలేదని కాగ్ ఎత్తిచూపింది. కొన్ని నిర్ణయాలు పాక్షికంగా నెరవేరాయని పేర్కొంటూనే, వివిధ పథకాల అమలుకు విధివిధానాలు రూపొందించకపోవడం, పాలనాపరమైన అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. శాసనపరమైన అనుమతి లేకుండా 2015-16లో 5,881 కోట్లు అదనంగా వెచ్చించారని పేర్కొంది. నీటిపారుదల, రహదారి రంగాల్లో నిర్మాణ పనులు సకాలంలో పూర్తికాలేదని కాగ్ ఆక్షేపించింది. ట్రెజరీ కార్యాలయాలు, పిఎఓల నుంచి 10,852 కోట్ల రూపాయలకు సంబందించిన ఓచర్లు రాలేదని, దాంతో నిధులను కాజేసినట్టు భావించాల్సి వస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. అవసరానికి మించి ముందుగా నిధులను డ్రా చేయడం, ఖర్చుకాని మిగులు మొత్తాలు సంవత్సరం చివరలో మురిగిపోవడం వల్ల పిడి ఖాతాల్లో భారీగా నిల్వలు పేరుకుపోతున్నట్టు గుర్తించింది. ఈ ఖాతాల పర్యవేక్షణ, నియంత్రణ సరిగ్గాలేదని ఈ అంశంతో స్పష్టమవుతోందని కాగ్ పేర్కొంది.