రాష్ట్రీయం

నేటినుంచి ఐఫా అవార్డు వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఈనెల 28, 29న జరగనున్నాయి. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. వేడుకల్లో హీరోలు రానా, నాని, తెలంగాణ టూరిజం సెక్రటరీ వెంకటేశం, హీరోయిన్లు లక్ష్మిరాయ్, ప్రగ్యజైస్వాల్, నాజర్, హీరో మార్కెటింగ్ సేల్స్ హెడ్ అశోక్ బసిన్, రెనాల్ట్ సిఇఓ సుమిత్ సౌహాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ఐఫా వేడుకలు ఈసారి హైదరాబాద్‌లో జరగడం ఆనందంగా వుందన్నారు. ఈ వేడుకలంటే నాకు చాలా ఆసక్తి అనీ, ఎప్పటిలా రొటీన్‌గా కాకుండా కొత్త తరహాలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. నాని మాట్లాడుతూ, గత ఏడాది ఈ వేడుకల్లో సాధారణ ప్రేక్షకుడిగా పాల్గొన్నాను కానీ, ఈసారి రానాతో కలిసి యాంకర్‌గా వ్యవహరిస్తున్నానని అన్నారు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ, ఐఫా వేడుకల్లో పాల్గొనడం ఎప్పుడూ నాకు చాలా కొత్తగానే వుంటుంది. ఈసారి కూడా దక్షిణాదికి చెందిన పలువురు హీరో, హీరోయిన్లు ఈ వేడుకల్లో డాన్సులతో ఆకట్టుకోనున్నారని అన్నారు. ఈ వేడుకల్లో 28న తమిళం- మలయాళ విభాగానికి, 29న తెలుగు- కన్నడ విభాగాలకు అవార్డులు అందజేస్తారు. ఈ వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో సాయంత్రం నుంచి మొదలు కానుందని ఐఫా నిర్వాహకులు తెలిపారు.