రాష్ట్రీయం

వెబ్ పోర్టల్‌ద్వారా ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్ కంపెనీలకు చెందిన ఆస్తుల వివరాలను వెబ్‌పోర్టల్‌లో ఉంచి ఇవేలం ద్వారా విక్రయించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు సిఐడి, పిటీషనర్లను ప్రతిపాదించింది. 50 కోట్లకుపైగా విలువ ఉన్న ఆస్తులను కోర్టులో వేలంద్వారా నిర్వహిస్తామని, అంతకంటే తక్కువ విలువ ఉన్న ఆస్తులను వెబ్ పోర్టల్‌ద్వారా వేలం నిర్వహించాలని, ఈ ప్రతిపాదనలపై సూచనలతో వస్తే చర్చించాక ఆమోదం తెలియజేస్తామంటూ విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. వేల కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలంటూ ఏజెంట్ల సంక్షేమ సంఘం తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం నాడు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తుతో పాటు ఆస్తుల విక్రయానికి సంబంధించిన సూచనలతో ఎపి సిఐడి అఫిడవిట్ దాఖలు చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది కృష్ణ ప్రకాశ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా డైరెక్టర్ల సోదరుల భార్యను వేధిస్తున్నట్టు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు. స్వాధీనం చేసుకున్న హార్డు డిస్క్‌లు, సిడిలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తు గొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. అనుబంధ కంపెనీలు దాదాపు 160 వరకూ ఉన్నట్టు తేలుతోందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.