రాష్ట్రీయం

భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే లైన్‌కు బోర్డు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28:్భద్రాచలం- సత్తుపల్లి రైల్వే లైన్‌కు రైల్వే బోర్డు మంగళవారం అనుమతించింది. ఈ మేరకే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకి సమాచారం పంపించారు. సింగరేణి కాలరీస్ సౌజన్యంతో భద్రాచలం రోడ్- సత్తుపల్లి మీదుగా కొవ్వూరు వరకు 133.70 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రతిపాదన. భద్రాచలం రోడ్- సత్తుపల్లి సెక్షన్ 53.20 కిలో మీటర్ల నిడివి. ఈ మార్గం నిర్మాణ వ్యయం 704.31 కోట్ల రూపాయలు. సివిల్ పనులకు 586 కోట్ల రూపాయలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పనులకు 34.47 కోట్ల రూపాయలు. సిగ్నలింగ్ అండ్ ట్రాక్షన్ పనులకు 29.90 కోట్ల రూపాయలు. ఎలక్ట్రికల్ పనులకు 53.41 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. భూ సేకరణ ఖర్చు భారత రైల్వేస్ సంస్థ భరిస్తుందని, నూతన రైల్వే లైన్ నిర్మాణ వ్యయం సింగరేణి కాలరీస్ సంస్థ భరిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.